పెద్ద నోట్ల రద్దు చేసి ఇంకా పెద్ద నోట్లు తెచ్చారు మోడీ సర్కారు. ఈ పెద్ద నోటికి (రెండు వేలు)   చిల్లర దొరక్క జనాల బోరుమంటున్నారు. అందుకే ఆ పెద్ద నోటుని  ఎటిఎం లలో లేకుండా చేయాలనీ అనుకుంటున్నారట బ్యాంకు వాళ్ళు. నగదు పరిమితి తగ్గించడానికి నోట్ల పరిమితి పెంచుతున్నారట....! అర్ధం కాలేదా.   నగదు పరిమితి తగ్గించి లావాదేవీలు పెంచే పనిలో పడ్డారు బ్యాంకు అధికారులు. ఇది అర్ధం కాలేదా...!సరే...ఇది చదవండి.భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్ (స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా).ఎప్పటికప్పుడు కొత్త సేవల్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే ఎస్.బి.ఐ  మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ తాజాగా ఏటీఎం క్యాష్ విత్‌డ్రా సేవల్లో అనేక మార్పులు తెచ్చింది. 


ఇక నుంచి ఎస్.బి.ఐ ఏటీఎంలలో రెండువేల రూపాయల నోట్లు ఉండవని తేల్చిచెప్పింది. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) సూచనలతో దాదాపు అన్ని ఏటీఎంల నుంచి ఎస్‌బీఐ 2వేల రూపాయల క్యాసెట్లను తొలగించేస్తున్నారట. అంతేకాదు, భవిష్యత్తులో రూ.200, రూ.100 నోట్లు మాత్రమే ఉంచేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు  RBI అధికారులు.చిన్న నోట్ల కారణంగా ఏటీఎంలలో ఉంచే నగదు పరిమితి తగ్గే అవకాశం ఉండడంతో ఆ మేరకు లావాదేవీల పరిమితిని పెంచే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారట.

మొన్నటి వరకు రోజుకి 4 సార్లు మాత్రమే......కానీ ఇప్పుడు  మెట్రో నగరాల్లో 10 సార్లు, ఇతర ప్రాంతాల్లో 12 సార్లు ఏటీఎం నుంచి నగదు తీసుకునే వెసులుబాటును బ్యాంకు అధికారులు కల్పించనున్నట్టు సమాచారం. ఇకపై డెబిట్ కార్డు ప్రాతిపదికన రోజుకు రూ.20,000 నుంచి రూ. లక్ష వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా నెలకు 8 నుంచి 10 వరకు ఉచితంగా ఏటీఎం ట్రాన్సాక్షన్స్ నిర్వహించుకోవచ్చని ఎస్‌బీఐ తన కస్టమర్లకు సూచించింది.

ఒకవేళ ఈ ఉచిత పరిమితిని దాటితే బ్యాంకు కస్టమర్ల నుంచి చార్జీలు వసూల్ చేస్తుంది. అక్టోబర్ 1నుంచి బ్యాంక్ సర్వీస్ చార్జీలను కూడా ఎస్‌బీఐ సవరించింది. అకౌంట్‌లో కావాల్సినంత డబ్బులు లేకుండా ఏటీఎం ట్రాన్సాక్షన్ జరిగితే ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: