ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్లు తాగడం ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు అందుకే  ప్లాస్టిక్ గ్లాస్‌ల స్థానంలో మట్టి గ్లాసులు, ప్లాస్టిక్ కవర్ల బదులు గుడ్డ సంచులు, ప్లాస్టిక్ ప్లేట్ల బదులు విస్తరాకులు...ఇలా పర్యావరణ కాలుష్యానికి కారణం అవుతున్న ప్లాస్టిక్ స్థానంలో ప్రకృతి సిద్దమైన వాటిని ఉపయోగించాలని  పర్యావరణ పరిరక్షణ కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం  చర్యలు చేపట్టింది.  సింగిల్ యూజ్ అంటే ఒక్కసారి మాత్రమే వాడగలిగే ప్లాస్టిక్ ఉత్పత్తులపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.     

ప్లాస్టిక్ బ్యాంకులు, కప్పులు, ప్లేట్లు, చిన్న బాటిల్స్, స్ట్రా వంటివి ఇక నుంచి ఇత్పత్తు చేయరాదు, ఉపయోగించరాదు, అలాగే నిల్వ చేయరాదు.  ఈ నేపథ్యంలో సంప్రదాయ ఉత్పత్తులకు ఆధునికతను జోడించి ప్రజలను జాగృతం చేసే ప్రయత్నాలలో భాగంగా సబ్బులు, బాటిల్స్ తీసుకు వచ్చింది. రెండు రోజుల క్రితం మహాత్మా గాంధీ జయంతి రోజున ఆవు పేడతో తయారు చేసిన సబ్బులు, వెదురు బొంగు బాటిల్స్‌ను లాంచ్ చేశారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.   ప్లాస్టిక్ బాటిల్స్ స్థానంలో వెదురు బాటిల్స్ వచ్చాయి.  అలాగే KVIC ప్లాస్టిక్ గ్లాస్‌ల స్థానంలో మట్టి గ్లాసులు తయారు చేస్తోంది.  సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల శాఖ (MSME) కింద పని చేసే ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (KVIC) వెదురు బాటిళ్లను తయారు చేస్తోంది. 
ఈ నేపథ్యంలో మంత్రి ఈ బాటిల్స్‌ను తయారు చేశారు. KVIC ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో బాటిల్స్ తయారు చేశారు. 


ప్రకృతిలో పెరిగే బొంగులతో పర్యావరణానికి ఎలాంటి హానీ లేకపోగా..... ఎక్కువ కాలం మన్నుతాయి. అలాగే ఈ  వెదురు బాటిల్లోని నీరు సహజంగా ఉంటుందని...ఈ వెదురు నీరు ఆరోగ్యానికి మంచిదన్నారు.కోటికి పైగా గ్లాసులను ఇప్పటికే సిద్ధం చేసింది. ఏడాది చివరికల్లా మూడు కోట్ల వెదురు బాటిల్స్ సిద్ధం చేయనుంది. అలాగే, ఆవు పేడతో తయారు చేసిన సబ్బులు, షాంపూలను ఖాదీ స్టోర్లలో విక్రయిస్తారు. ఇలాంటి వాటితో రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి పర్యావరణానికి మేలు జరగడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.750 మిల్లీ లీటర్ల వాటర్ బాటిల్ ధర రూ.300గా ఉంది. 900 మిల్లీ లీటర్ల వాటర్ బాటిల్ ధర రూ.560. 125 గ్రాముల సోప్ వేరియంట్ ధర రూ.125. ఇది ఖాదీ స్టోర్లలో విక్రయిస్తున్నారు. 


ప్రస్తుతం ఈ బాటిల్స్ తయారీకి త్రిపుర అడవుల వెదురును ఉపయోగిస్తున్నట్లు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ అధ్యక్షులు వినయ్ కుమార్ తెలిపారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలో 20 ఎంఎస్ఎంఈలు రిజిస్టర్ అయ్యాయని, కాపిటల్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాయని, వీటిని ప్రోత్సహించేందుకు 10 శాతం ఈక్విటీని ప్రభుత్వం అందిస్తుందని గడ్కరీ చెప్పారు. 
KVIC రానున్న రెండేళ్లలో రూ.10,000 కోట్లకు పైగా టర్నోవర్‌కు చేరుకోవాలన్నారు. తద్వారా పెద్ద మొత్తంలో ఉద్యోగాలు కల్పిస్తుందన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: