భారతీయ ప్రభంద కావ్యాల్లో శృగారాన్ని రసవత్తరంగా చిత్రించిన కవుల్లో శేషము వేంకటపతి రచించిన అద్భుత మేలిమి శృంగార గ్రంధమే "తారా-శశాంకము" పద్దెనిమిదవ శతాభ్ద కాలములో ఈ గ్రందాన్ని కొంతకాలం నిషేదించారు. విజ్ఞుల వాదనలు ప్రతివాదనల తరువాత ఈ గ్రంధమును “పండితులు మాత్రమే చదవతగిన గ్రంధం” (Scholar’s Edition) గా పరిగణించారు.


చలం సృష్టించిన 'స్త్రీ' కంటే ముందుతరం ప్రౌడ వనిత అనదగిన తార, ఈ గ్రంధంలో కధానాయకి. నాడే, ధర్మ వివాహాన్ని కాదని సహజ ప్రేమని ప్రతిపాదిస్తుంది . ‘ఆవిష్కృత శృంగారత’ ఈ గ్రంధలో పరిమళాల్ని విరింపచేసింది. కధా సంధర్బానుసారంగా, దెవగురువైన బృహస్పతి, ధర్మ పత్ని తారాదేవికి….. బృహస్పతి సనాతన చాందసంపై విరక్తి కలుగుతుంది. పర్యవసానంగా తన పతి ప్రియ శిష్యుడైన చంద్రునిపై మనసుపడి అతనిని విడనాడుతుంది.


ఒక సారి దేవగురువు దేవేంద్రుని ఆదేశానుసారం అమరావతిలో ఒక మహోన్నత యజ్ఞాన్ని నిర్వహించటానికి బయలుదే సమయములో తన భార్యకు “మగడూరలేనప్పుడు పత్ని ఏలా ఉండాలో” ఉపదేశం చేస్తాడు. తార ఏమో విలాసినీమణి, రూప లావణ్యవతీ , నవనవోన్వెషిణీ, యవ్వనోద్భాషిని. ఉరకలెత్తే జవ్వనములో మిసమిసలాడే రసికశిఖామణి. ఇక బృహస్పతి పండువారుతున్న వయసున్నవాడు.
బృహస్పతి చెప్పిన పాతివ్రత్యధర్మాలను దూదిపింజలా చెదరగొదుతూ సరస శృంగారం కూడా ఒక మహోన్నత యజ్ఞమే అని వివరించిన సంధర్భంలో ప్రవచించిన చెంపకమాలే ఈ పద్యం.


ప్రతిపదార్ధ సహితంగా వివరించాను. పఠించి పరవశించండి.


“గళ రవ మంత్రముల్ సెలగగా, జిగి సిబ్బెపు గుబ్బ చన్నుల
స్కలశము లంది ఉండి, జఘనం బను వేదిక నొండి ఉండి యు
జ్వల రశనన్, గ్రహించి, జిగి వాతెఱ సోమరసంబుగ్రోలు వే
డ్కలు గల మన్మధ క్రతువు కన్నను, వేఱొక జన్న మున్న దే?"


పద విభజన-పద అర్ధం

గళ రవ = గొంతు నుండి ద్వనించే అదో మత్తైన శబ్ధం - మంత్రముల్ సెలగగ = వేదఘోషలా ప్రజ్వరిల్లగా - జిగి = బిగువైన (ప్రత్యేక శోభ, కాంతితో )-సిబ్బెపు = బోర్లించిన గిన్నెలలాంటి-గుబ్బ = బలమైన, ఏత్తైన రూపం - చన్నులన్ = వక్షోజములు-కలశము = పిరమిడ్ ఆకార పాత్ర-అంది = పొంది -ఉండి = కలిగినదై - జఘనం = నడుము చూట్టూ ఉన్న పిరుదులు, తొడలప్రాంతము-అను = అనే-వేదిక = విశాలమైన రంగస్థలం (యజ్ఞస్థలము)అంది= పొంది- ఉండి=కలిగి-ఉజ్వల = శృంగార శోభతో-రశనన్ = రుచి, పరిమళం-గ్రహించి = పొంది, స్వీకరించి- జిగి = ప్రత్యేక శోభ, కాంతితో-వాతెఱ = అధరం, పెదవి-సోమరసం= అమృతం-గ్రోలి= తాగి, అనుభవించి, ఆస్వాదించి-వేడ్కలు = పందుగలు, విందు, వినోదం-గల=కలిగిన-మన్మధ క్రతువు= మైదునం అనే కార్యం-మించిన = గొప్పదైన-జన్నము = యజ్ఞము-ఉన్నదే = ఉన్నదా?

పధ్యార్ధం - తాత్పర్యం

“జఘనమనే యజ్ఞవేదికపై సరస శృంగార రసాస్వాదనలో ఉన్న దంపతులు సాగించే కార్యమే మన్మధ క్రతువు. ఆ సమయంలో ఆ జవ్వని స్వరము నుంచి వెలువడే సుస్వర ద్వనులే వేదఘొష, వేదమంత్రాలు. జిగి, బిగి కలిగి బోర్లించిన బంగారు పాత్రల వలే ప్రత్యేక శోభతో విలసిల్లే ఉన్నత వక్షోజాలే యజ్ఞ కలశాలు. శృంగార శోభతో ప్రజ్వరిల్లే ఆ జవ్వని అధరాలనుండి పురుషుడాస్వాదించే అధరామృతమే సోమరసం. విందు, వినోదం, ఉల్లాసం, ఉత్తేజం, ఉత్సాహంతో ఆ మిధునం సాగించిన ఆ రతీ మన్మధ కేళే ఒక మహోన్నత యజ్ఞం. బంగారంలాంటి శృగారం కంటే ఉన్నతమైన యజ్ఞమున్నదా?”
అంటూ సరస, విలాస, సౌందర్యవతి తార బృహస్పతిని ప్రశ్నించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: