పచ్చని ఆకు కూరలను మన భోజనంలో రకరకాల వంటలతో కలుపుకుని తనడం వల్ల మన ఆరోగ్యానికి సమకూరే ప్రయోజనాలను తెలుసుకుంటే మనం ఆకుకూరలను తనడం వదిలి పెట్టం అన్న మాట అతిశయోక్తి కాదు.  ఆకుకూరలు అతి చౌకగా లభించే అన్ని పోషక విలువలుగల ఆహారం. అనేక రకాల ఆకుకూరలు మనకు లభ్యమవుతున్నాయి. తోట కూర, కొయ్యతోటకూర, బచ్చలి, మెంతికూర, కొత్తిమీర, కరి వేపాకు, మునగాకు, గోంగూర, చింతచిగురు, పొన్నగంటి, పాలకూర, చుక్కకూరను ఎక్కువగా మన ఆరోగ్యానికి మేలుచేసే ఆకు కూరలుగా గుర్తిస్తారు. 

ఆకుకూరలలో ముఖ్యంగా క్యాల్షియం, ఇనుము, విటమిన్‌ ఎ సి రైబోఫ్లెవిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ మరియు పీచు ఎక్కువగా ఉండే పదార్ధాలు ఉండటంతో ఆకు కూరలతో అనేక సలాడ్‌, సూపులు, చట్నీలుగా చేసి తీసుకోవచ్చు. ముఖ్యంగా ఆకు కూర లు వండే సమయంలోమూతలు పెట్టి వండండి. అలాగే ఆకుకూరలు ఉడక పెట్టాక ఆందులోనీటిని పారేయకండా కాస్త నిమ్మరసం, ఉప్పు, కలిపి సూప్‌గా తీసు కుంటే ఆరోగ్యానికి మంచిది. 

ఆకుకూరల్లో విటిమిన్ ఎ, కె మరియు ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి వివిధ రకాల  ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని రక్షిస్తుంది మరియు శాస్వ సంబంధిత సమస్యలను, యూరినరీ మరియు పేగు సంబంధిత సమస్యలను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతాయి. ఒక కప్పు ఆకూరలను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మలబద్దకాన్ని మీ దరిదాపుల్లోచేరనివ్వదు. మలబద్దకం నివారించడంలో అద్భుతంగా సహాయపడుతాయి ఆకుకూరలు. ఆకుకూరల్లో డైటరీ ఫైబర్ ఫుష్కలంగా ఉండీ మన జీవక్రియను శుభ్రం చేస్తుంది. ఆకుకూరలు శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడే గుణాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. 

ఆకుకూరల్లోని విటమిన్స్ మరియు మినిరల్స్ హైబ్లడ్ ప్రెజర్ ను నివారించడానికి మరియు ఇతర సమస్యను నిరోధించడానికి బాగా సహాయపడుతాయి. ఆకుకూరల్లోని మెగ్నీషియం బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంచేదుకు బాగా సహాయపడుతుంది. అలాగే ఆకుకూరల్లోని ఫొల్లెట్, కార్డియో వాస్కులర్ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ ఆకుకూరలు ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వలన  బ్యాడ్కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి రోజూ ఒక కప్పు ఆకుకూరలు తీసుకోవడంమంచిది. కళ్ళకు సంబంధించిన వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ ఆకు కూరల వినియోగం మన దైనందిన ఆహారపు అలవాట్లలో ఒక భాగంగా చేసుకుంటే అనేక ఆరోగ్య సమస్యల నుండి బయట పడటం ఖాయం..


మరింత సమాచారం తెలుసుకోండి: