అందమైన పనువరసతో మెరిసే దంతాలను చూస్తే ఎవరైనా ఆకర్షింప బడతారు.  దంతాలు ఆరోగ్యంగా ఉంటే మన శరీరానికి సంబంధించి అనేక ఆరోగ్య సమస్యలు కూడ ఉండవు.  ప్రతిరోజు రోజుకు రెండు సార్లు చొప్పున బ్రెష్ చేసుకుంటే అందమైన దంతాలు ఉంటాయి అని అనుకుంటే పొరపాటే.  అందమైన పనువరస కోసం చాల జాగ్రత్తలు తీసుకోవాలి.  డెంటల్ హైజీన్ వల్ల దంత, చిగుళ్ల సమస్యలను మరియు దంతక్షయాన్ని నివారించుకోవచ్చు. 

దంతాలనొప్పి, వాపు, రూట్ కెనాల్ పెయిన్, ఇతర దంత సమస్యలను నివారించడంలో మన దంతాలకు సంబంధించిన శుభ్రత పాటించడం చాలా అవసరం. మన దంతాల గురించి గురించి నిర్లక్ష్యం వల్ల దంతాల నొప్పివాపులు రావడమే కాకుండా ఇతర సమస్యలకు ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.

దంత సమస్యలు లేకుండా ఉండాలంటే కొన్ని హైజీనిక్ టిప్స్ ఖచ్చితంగా పాటించాలి.  టూత్ బ్రష్ ను రెగ్యులర్ గా మార్చాలి.  దంతాల మద్యపాచి తొలగించాలి, ముందర పళ్ళు మాత్రమే కాదు, పోలిపళ్ళు కూడా శుభ్రం చేయాలి.  భోజనం చేసిన ప్రతి సారి బ్రష్ చేయడం మర్చిపోకూడదు. అలాగే మౌత్ వాష్ ఉపయోగించాలి. 

దీని వల్ల నోట్లో దంతాల మద్య చిక్కుకున్న ఆహారాలను పూర్తిగా తొలగిస్తుంది. అందమైన పనువరస  కోసం పౌష్టికాహారాలను ఎక్కువగా తీసుకోవాలి.  న్యూట్రీషియన్స్ క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకునే వారికి అందమైన పనువరస ఉంటుంది. అదే విధంగా  జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. హెల్తీ సలాడ్స్ సాఫ్ట్ డ్రింక్స్ మంచి వని చాలా మంది భావన. కానీ సాప్ట్ డ్రింక్స్ మంచిది కాదు. 

స్వీట్స్ ను పూర్తిగా తగ్గించాలి. భోజనానికి ముందు నీరు తాగడం మంచిది. షుగర్ ఫుడ్స్ కు దూరంగా  స్వీట్స్, క్యాండీబార్స్, బిస్కెట్స్, పాస్ట్రీ ఇవన్నీ ఆరోగ్యంగా ఉన్న దంతాలకు శత్రువులు లాంటివి.  మీల్స్ కు మద్య స్నాక్స్ తినాలనిపిసతే వెజిటేబుల్స్, లోషుగర్ ఫుడ్స్, లోసోడియం తీసుకోవాలి. 

పసుపుపచ్చని దంతాలు చూడటానికి చాలా అసహ్యంగా ఉంటాయి.  అందువలన ఇటువంటి సమస్యలు రాకుండా నివారించు కోవడానికి బేకింగ్ పౌడర్ తో దంతాలను శుభ్రం చేసుకోవాలి. టూత్ పేస్ట్ కు ఉప్పు చేర్చి బ్రెష్ చేస్తే మన దంతాలు ఆరోగ్యంగా ఉండి మన పనువరస అందంగా కనిపిస్తుంది.  సంవత్సరానికొకసారైనా డెంటిస్ట్ ను కలిసి దంతాలను శుభ్రం చేయించుకోవడం చాల మంచిది. మన శరీర ఆకృతి ఎంత అందంగా ఉన్నా మన పనువరస అందంగా లేకపోతే ఎదో ఒక లోటుగా కనిపిస్తుంది. అందువల్ల అందమైన పనువరస చాలామంది ఇప్పుడు చాల శ్రద్ధ తీసుకుంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: