కడదాకా తోడుండేవాడే నిజమైన స్నేహితుడు హితం కోరుకునేవాడు స్నేహితుడు.. కడదాకా తోడుండేవాడు స్నేహితుడు.. కాంతిపుంజమై వెలుగునిచ్చేవాడు స్నేహితుడు. కష్టాల్లో ఓదార్చేవాడు స్నేహితుడు. దిశానిర్దేశం చూపేవాడు స్నేహితుడు. స్నేహితుని కోసం తపించేవాడు స్నేహితుడు..

నేడు స్నేహితుల దినోత్సవం :

Image result for స్నేహితుల దినోత్సవం

స్నేహాన్ని పువ్వుతో పోల్చకు వాడిపోతుంది... మంచుతో పోల్చకు.. కరిగిపోతుంది... ఆకుతో పోల్చకు ..రాలిపోతుంది... నీ చిరునవ్వుతో పోల్చు.. శాశ్వతంగా ఉండిపోతుంది...

friendship day, friendship day 2017, friendship day sms, friendship day quotes, friendship day messages, friendship day wishes, friendship day greetings, indian express, indian express news

మనసు మారుతుంది ఒక మాటతో... కల చెదిరిపోతుంది ఒక మెలకువతో... ప్రేమ విడిపోతుంది ఒక అనుమానంతో... జీవితమే ఉన్నతంగా మారుతుంది మంచి స్నేహంతో... 


కటిక చీకటి కమ్ముకున్న వేళ... అతనో కాంతిపుంజంలా వెలుగునిస్తాడు. కనురెప్ప కలవరిస్తున్న క్షణాన.. దారిచూపే మార్గదర్శి అవుతాడు. మనసు తెరపై మసక చేరితే... అతని స్పర్శే మంచి గంధం అవుతుంది. మన లోపాలను చికిత్స చేసే వైద్యుడు... సమస్యలు...ఒత్తిడులను తొలగించి, సేదతీర్చే మానసిక తత్వవేత్త అతడు... ధైర్యానికి తాయెత్తు.. ఆపదలో ఆప్తుడు... ప్రాణతోడు.. ఆనందాల గూడు.. కలల రూపం.. కళల దీపం... అతడే స్నేహితుడు... కడదాకా తోడుండేదే 
Image result for friendship day
నిజమైన స్నేహం...
స్నేహం వినడానికీ.. చూడ్డానికి కేవలం రెండక్షరాల పదం.. కానీ ఇందులోని భావం ఆనంతం.. మాటలకందని బంధం... సృష్టిలో తల్లిదండ్రులు.. తోబుట్టువుల ఎంపికలో మన ప్రమేయం ఉండదు.. ఒక స్నేహితుడి విషయంలోనే ఇది సాధ్యం... మనకున్న ఫ్రెండ్స్‌లో అంతా బెస్ట్‌గా ఉండరు. ఒకరిద్దరు మాత్రం మనస్సులో ఎవరెస్టులా ఉంటారు. వారే ప్రాణస్నేహితులు.. కన్నతల్లిదండ్రులు, రక్తం పంచుకు పుట్టిన పిల్లలకు చెప్పుకోలేని విషయాలను సైతం వారితో పంచుకుంటాం.. అదే స్నేహమంటే...! నిజానికి నిత్యం మనకు కొత్త ఫ్రెండ్స్ పరిచయమవుతుంటారు. అలాగని ప్రతి రోజూ ఫ్రెండ్‌షిప్‌డే చేసుకోలేం. అందుకే మన కోసం ఆగస్టు మొదటి ఆదివారం వచ్చింది. 
Image result for friendship day
మంచి స్నేహితునితో జీవితం ధన్యం... 
వాల్మీకి, వ్యాసులు, వామ, సుగ్రీవు లు, కృష,్ణ కుచేలుల స్నేహబంధం మానవాళికి ఆదర్శమైంది. స్నేహమేరా జీవి తం... స్నేహమేరా శాశ్వతం.. అని ఒక కవి, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడి పోదురా ఈస్నేహం అంటూ మరో సినీ రచయిత స్నేహానికి ఉన్న విలువను వివరించారు. పురాణ గాథల నుంచి నేటి వరకు స్నేహ బంధం జేజేలందుకుంటోంది. స్నేహం ముందు అన్నీ బలాదూరే అని అనటం లో అతిశయోక్తి లేదు. విజయంలో నీడలా... నిరాశలో ఆశాదీపం లా.. ఆపదలో నేనున్నానని వెన్నంటి నిలుస్తూ.. మన క్షేమాన్ని, అభివృద్ధిని ఆకాంక్షించే ఒక నే స్తం ఉంటే చాలు... వెయ్యి వరహాలు ఎందుకని అంటారు. అటువంటి స్నేహితుడిని కలిగి ఉన్న ప్రతి జీవితం ధన్యమే..
Image result for friendship day
కళ్లముందు కదలాడేది స్నేహితుడే...
అమ్మతో పంచుకోలేనిది... నాన్నతో చెప్పుకోలేనిది... అర్థాంగికి సైతం అంతరంగం వినిపించలేని సమయంలో.. కళ్లముందు కదలాడేది స్నేహితుడే.. అతడి చేతిస్పర్శ ప్రపంచాన్ని జయించే ధైర్యమిస్తుంది... వెన్నంటి నడిస్తే వేయి ఏనుగుల బలం వస్తుంది... ఖండాంతరాలు దాటినా, కష్టాలు ఎదురైనా, చితిమంట వరకూ వీడిపోనిదే నేస్తం. స్నేహమేరా జీవిత.. స్నేహమేరా శాశ్వ తం... అన్నాడో సినీకవి. అవును.. సృష్టిలో తియ్యనిది స్నేహమే! మనం కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు, ఓదార్పు నావలో తీరం చేర్చేది స్నేహితులే! జీవితాంతం మన వెన్నంటి నిలిచేది వాళ్లే! అందుకే జీవితమే స్నేహం... స్నేహమే శాశ్వతం... ప్రపంచమంతా నీకు దూరమైనప్పుడు నీ పక్కన ఉండే వాడే నిజమైన స్నేహితుడని అంటారు.! స్నేహమంటే నిస్వార్ంథ.. స్నేహ మంటే త్యాగం. నేడు
Image result for friendship day
ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా......
స్నేహితుల దినోత్సవం ఈవిధంగా ప్రారంభమైంది...
స్నేహితుల దినోత్స వం అమెరికాలో పుట్టి, నేడు ప్రపంచ దేశాల్లో స్నేహితులను ఒక్కటి చేస్తోంది. 1919లో అమెరికాలో ఆల్‌మార్క్ అనే వ్యక్తి ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్ షిప్‌డే జరుపుకోవాలని భావించాడు. గ్రీటింగ్స్ పంచుకోవాలని ప్రచారం మొద లు పెట్టాడు. కొంతకాలం అది కొనసాగినా 1940 మధ్య కాలంలో దీనిపై ఆసక్తి తగ్గిపోయింది. ఆతర్వాత 1958 నుంచి మళ్లీ ఫ్రెండ్‌షిప్‌డే జరుపుకోవడం మొదలైంది. 1990లో ఆల్‌మార్క్ ఆధ్వర్యంలో అధికారికంగా ఫ్రెండ్‌షిప్‌డే జరుపుకోవడానికి అమెరికా ప్రభుత్వం అంగీకరించింది. ఇలా ప్రపంచ దేశాలకు వ్యాపించింది. ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ కోఫీ అన్నన్ భార్య కూడా 1998లో ఓ మీటింగ్‌లో ఫ్రెండ్‌షిప్ ప్రాముఖ్యతను ప్రస్తావించింది. ఆ తర్వాతే డాది ఏప్రిల్ 27న అమెరికాలోని జనరల్ అసెంబ్లీలో ఓ తీర్మానం జరిగింది. అంతర్జాతీయంగా జరుపుకోవాలన్నది దాని సారాంశం. కాగా స్పెయిన్‌లో జూలై 20న స్నేహితుల దినోత్సవం జరుపుకుంటుండగా మన దేశంలో ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకోవడం అనవాయితీ.
- సొంటేల ధనుంజయ


మరింత సమాచారం తెలుసుకోండి: