అక్షయ తదియనాడు కనీసం ఒక గ్రాము బంగారమైనా కొనాలని, అలా కొన్నవారి యింట బంగారం అక్షయంగా వృద్ధి పొందుతుందని మనందరి విశ్వాసం. అది నిజమే. కానీ,దానిని అర్థం చేసుకోవడం లోనే చిన్న లోపం.  అక్షయ తదియనాడు తప్పకుండా శక్త్యానుసారం బంగారం కొనాలి. అది కూడా లక్ష్మీరూపం ఉన్న నాణేన్ని కొనాలి.
Image result for akshaya tritiya-2018
ఆ లక్ష్మీరూపుని శ్రీమహావిష్ణువు సన్నిధిలో ఉంచి షోడశోపచార విథులతో, చందనాను లేపనాదులతో అర్చించి, ఆ బంగారు లక్ష్మీరూపును ఒక సద్భ్రాహ్మణునకు దానం ఇవ్వాలి. ఆ దానం వల్ల దాత గృహంలో సువర్ణం అక్షయమవుతుంది. ఇందుకు మనందరకూ ఆదిశంకరుల బాల్య సంఘటన ప్రత్యక్ష నిదర్శనం. బాల శంకరులకు ఓ పేద బ్రాహ్మణి ఓ ఎండు ఉసిరికాయను భిక్షగా వేసి, బంగారు ఉసిరికాయను ప్రతిఫలంగా పొందలేదూ! 
Image result for akshaya tritiya-2018
ఒక విత్తును నాటితే వందవరికంకులు రావడం లేదూ! మనం ఏ విత్తనం నాటుతామో అలాంటి ప్రతిఫలాన్నే పొందుతాం. మనం ఏ దానం చేస్తామో .... అదే ప్రతిఫలాన్ని అక్షయంగా అందుకుంటాం కనీసం ఈ అక్షయ తదియనాడైనా శక్త్యానుసారం సువర్ణాన్ని కొందాం. సువర్ణదానం చేద్దాం. అక్షయ సంపదలు అందుకుందాం. ఇదే "అక్షయతదియ' 'వెనుకనున్న అంతరార్థం, పరమార్థం. 


మరింత సమాచారం తెలుసుకోండి: