ఇది పుట్టింటి వారు జరిపే వేడుక. పుట్టిన బాబు లేక పాపకు జత డ్రస్సులు, 3 సబ్బులు, కొబ్బరినూనే సీసా, పౌడర్ డబ్బా, పౌడర్ ఫేస్, తిలకము, కాటుక, ఇయర్ బడ్స్, దుప్పటి, టవలు, బొమ్మలు, రబ్బరు షీటు, హగ్గసులు ఇలా ఎవరి స్థోమతను బట్టి వారు ఇచ్చుకుంటారు.  


బంగారు వస్తువులు :  మురుగులు, తోడాలు, గొళ్లపు గొలుసులు, లేక గాజులు, మొలపట్టి, గొలుసు
వెండి వస్తువులు : పౌడరు డబ్బా, పౌడర్ పఫ్, గిన్నె స్ఫూను, ఇలా ఎవరి ఇష్ట ప్రకారం వారు చేసుకొనవచ్చును.  బారసాల జరపు స్థలములో బాగా అలంకరించి ఈ వేడుక జరుకోవాలి. ఈ బారసాల వేడుకకు వచ్చిన ముత్తైదువులకు, పసుపు పూయాలి, వేడుక అయిన తర్వాత తాంబూలం అందించాలి.  బాలింతకు చీర, జాకెట్లు, మోడిపుల్లు, బెల్లము, నెయ్యి, వెల్లుల్లిపాయలు, ఒక ప్లేటులో ఉంచి ఇవ్వాలి.  పీటల మీద అల్లుడు ని కూర్చుండబెట్టి నూతన వస్గ్రములు పెట్టాలి. వియ్యపురాళ్లు పసుపు, కుంకుమలతు తాంబూలం ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి.


ముదిమనవల సంతానము అయితే : 
ఈ బారసాల నాల్గవ తరము వారిది అయితే శుభకార్యం పూర్తి అయిన తర్వాత మనుమడు, మనుమని భార్య ఈ ఇద్దరు దంపతులు, తాతకు, నాన్నమ్మకు పాద పూజ చేసి వారికి నూతన వస్త్రాలు పెట్టాలి.  ఆ వస్త్రములు కట్టుకొని ఆ దంపతులు ముదిమనవనికి బంగారు ఉగ్గుగిన్నెతో పాలు తాగించాలి. పుట్టిన బాబుతో తోటకూర గింజలు అతని చేతిలో ఉంచి మట్టిలో చల్లించాలి.
Image result for barasala images
ఆ మట్టిని ఇంటికి తీసుకు వెళ్లి కుంపటిలో వేసి తోట కూటకూర వస్తుంది. ముది మనుమని ఎత్తుకొని వృద్ద దంపతులు మూడు గుమ్మాలు దాటవలెను. తోటకూర మొక్కలు మొలచి ఆకులు వచ్చిన తరువాత దానిని వండి ముది మనవని చేతుల మీదుగా పళ్లెములో పెట్టించుకుని తినవలెను. నానమ్మ తాతయ్య ఇద్దరు ఉన్నా వీరిలో ఏ ఒక్కరు ఉన్నా కూడా ఈ శుభకార్యం వేడుకలు జరుపుకోవచ్చును. 


మరింత సమాచారం తెలుసుకోండి: