సాధారణ మహిళా అయినా..సంఘవిద్రోహుల తాటతీస్తున్న చందన దీప్తి , ఐపీఎస్ !
మరిన్ని

సాధారణ మహిళా అయినా..సంఘవిద్రోహుల తాటతీస్తున్న చందన దీప్తి , ఐపీఎస్ !

ఇప్పుడు ప్రపచంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు.  శాస్త్రవిజ్ఞానంలోనే కాదు వైద్య, విద్యా, రక్షణ శాఖల్లో పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారు.  సమాజంలో పోలీస్ శాఖకు ప్రత్యేక గౌరవం ఉంటుంది..ఎక్కడ ఏ అల్లర్లు జరిగినా..దోపిడీ, హత్యలు జరిగినా వెంటనే స్పందించి..దోషులను పట్టుకొని శిక్షిస్తారు.   ఇక ఉన్నత హోదాలో ఉన్న అధికారులపై ఎంతో వత్తిడి ఉంటుందన్న విషయం తెలిసిందే.  సమాజంలో ఏ చిన్న రాద్దాంతం జరిగినా  ప్రతి ఒక్కరూ పోలీస్ డిపార్ట్ మెంట్ పై నిందలు వేయడం చూస్తూనే ఉంటాం..పోలీసుల వైఫల్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపణలు చేయడం చూస్తూనే ఉంటాం..అయితే వీటన్నింటిని సమర్థవంతంగా ఎదుర్కొని సొసైటీలో శాంతిని తీసుకు రావడానికి శాయశక్తులా ప్రయత్నిసారు పోలీసులు. 

అలాంటి పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉన్నత హోదాలో ఊంటూ..సమాజ సేవ చేస్తూ..ఒక చిన్నారిని అడాప్ట్ చేసుకొని పాప చదువు ఇతర బాధ్యతలు దగ్గరుండి చూసుకుంటున్న ఓ పోలీస్ అధికారిణి గురించి చాల తక్కువ మందికి తెలుసు.  సాధారణంగా ఐపీఎస్ అధికారి అనగానే.. అవినీతి, ఆడంబరం, అక్రమ సంపాదన, క్రూరత్వం, రెడ్ టేపిజం, ఇలా ఎన్నో పదాలు వినిపిస్తాయి.  కానీ ఈ ఐపీఎస్ అధికారిని మాత్రం చాలా విభిన్నం. చందన దీప్తి 2012 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. అచ్చ తెలుగమ్మాయి. ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఈ అమ్మాయి రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణలో నియమిపబడ్డారు.  తెలంగాణ సీఎం కెసిఆర్ తన అధికారిక మెదక్ జిల్లా పర్యటన సందర్బంగా ఒక చిన్నారిని అప్పగించాడని ఆ చిన్నారి బాధ్యతలు తీసుకొని స్వయంగా ఆ అమ్మాయి చదువు బాధ్యతను తానే పర్యవేక్షిస్తుంది.

2012 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ అధికారి అయిన ఈమె సైకిల్ వేసుకొని మెదక్ గల్లీల్లో తిరుగుతుంది. ప్రజల్లోకి చొచ్చుకుపోతుంది. సమస్యలు తెలుసుకుంటుంది. పరిష్కారం చేయటానికి ప్రయత్నిస్తుంది.   2012 లో లానే అంతే తాజాగా, అంతే ఉత్సహంగా ఉండటం అభినందనీయం. అదే ఈమె ప్రత్యేకత. ఒక ఆమ్రపాలి ఒక స్మిత సబర్వాల్ ఒక చంద్రకళ వీళ్ళ్లే కాదు ఒక చందన దీప్తి అనే యువ అధికారిణి కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఈ యువ అధికారిణి ఇప్పడు ప్రస్తుతం మెదక్ జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు నిజామాబాద్ ఓఎస్డీ గా పని చేశారు. వ్యవస్థ తాలూకు అవలక్షణాలు ఈమెకు చాల దూరం. ఆమెని చూడగానే ప్రశాంతతకు మరో రూపం ఆమేనని అనిపించక మానదు. చూడచక్కని సౌందర్యం... నక్షత్రాల్లాంటి నయనాలు... బాణాల్లాంటి చూపులు.... చందమామ లాంటి మోము.... చదువుల తల్లి జ్ఞాన సరస్వతి తననే అంటిపెట్టుకుందా అన్నట్లుగా కనిపించే తన వదన విజ్ఞాన తేజస్సు. ముఖ్యంగా ముఖాన గుండ్రటి బొట్టుతో ముచ్చటగా ఉంటుంది. ఆమే చందన దీప్తి, ఐపీఎస్. 


నిజానికి యూపీఎస్సీ పరీక్షలో పాసై ఏదో కేంద్ర సర్వీస్ దక్కితే చాలు... ఇక చాలు ఇంకేం అవసరం లేదు ఆ పోస్ట్ ద్వారా దక్కే జీతం, గీతం, హోదా, అధికారం, పెత్తనం, వావ్ జీవితం పులపాన్పు అవుతుందనిపిస్తుంది చాలా మందికి. కానీ ఆ పోస్ట్ కి విలువ తీసుకొచ్చేది, దాన్ని సేవకి వినియోగించుకునేది కొందరే... నిజానికి ఇలాంటి అధికారులను సీనియర్ ఐపీఎస్ అధికారులు చాల చిల్లరగా, చీప్ గా చూస్తారు. కానీ యువ అధికారులందరూ అవేం పట్టించుకోరు. ప్రజలకు తామేం చేయాలని నిర్ణయించుకున్నామో అవన్నీ చేసేస్తారు. అలాంటి వాళ్లలో చందన దీప్తి ఒకరు. ఎవరిని నొప్పివ్వకుండా, తన గురి తప్పకుండా తన పని తాను చేసుకుంటూ ప్రజలకు వీలయినంత దగ్గరగా ఉంటారు.