అక్కడ ఉంటే రోజుకు రూ.1000 ఇస్తారట !! మీరు పని చేయక్కర్లేదు, హాయిగా ఎంజాయి చేయవచ్చు. నెలకు 30 వేలకు పైగా తీసుకోవచ్చు .
కొత్త ప్రాంతంలో నివసించాలంటే, అక్కడున్న పరిస్ధితులను బట్టి ఎంతకొంత అద్దె కట్టాల్సి ఉంటుంది.

కానీ, మీరు రండి మా ద్వీపంలో నివసిస్తే, మేమే మీకు నెలకు రూ. 30వేలు చెల్లించి మరో పదివేలు ఖర్చులకు ఇస్తాం అని అధిరిపోయే ఆఫర్‌ ఇస్తోంది ఆ దేశం. నమ్మక పోతే ఇది చదవండి...

గ్రీస్‌ దేశంలోని అంటీకైథెరా ద్వీపానికి వెళ్లి అక్కడ నివసిస్తే.. నెలకు రూ. 40వేలు (450 పౌండ్లు) అక్కడి ప్రభుత్వం చెల్లించనుంది. మధ్యధర సముద్రంలోని క్రెటా, కైథిరా దీవుల మధ్య అంటీకైథెరా ద్వీపం ఉంది. ప్రస్తుతం ఈ ద్వీపంలో కేవలం 24మంది మాత్రమే నివసిస్తున్నారు. వేసవికాలం వస్తే ఇక్కడ నివసించే వారి సంఖ్య 60 వరకు పెరుగుతుంది.

అంతగా ఆధునిక సౌకర్యాలు లేని ఆ ద్వీపంలో ఆహారం తక్కువగా దొరుకుతుందని, అయితే, అపారమైన విశ్రాంతి, విహారాలకు ఈ ద్వీపం నెలవని అంటీకైథెరా అధికారిక వెబ్‌సైట్‌ లో ఉంది. ప్రకృత సోయగాలతో, ఈ ద్వీపం ఎంతో అందంగా ఉంటుందని, ఎక్కువ కుటుంబాలు ఇక్కడికి వచ్చి నివసించాలని, మళ్లీ ఈ ద్వీపం పునర్‌వైభవాన్ని సంతరించుకోవాలని కోరుకుంటున్నట్టు ద్వీపం మేయర్‌ ప్రపంచ ప్రజలను కోరుతున్నారు.

రాను రాను ఈ ద్వీపంలో నివసించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్న నేపథ్యంలో అక్కడి సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: