దేశంలో జనాభా వంద కోట్ల నుంచి 125 కోట్లకు చేరుకుంది.  మరికొద్ది సంవత్సరాల్లో చైనా జనాభాను మించిన ఆశ్చర్యపోనవసరం లేదు.  ఎందుకు ఇలా జరుగుతున్నది.  జనాభాను అరికట్టాలంటే ఏం చేయాలి.  భూమి పెరగదు.  జనాభా పెరుగుతుంది.  


జనాభా ఉండేందుకు తగినంత స్థలం దొరకడం లేదు.  దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.  దీనిపై ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థా యూబీ బ్రౌజర్ ఇండియా జనాభాపై ఓ సర్వేను నిర్వహించింది.  

ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.  దాదాపు 45 వేల మందిపై సర్వేను నిర్వహించింది.  ఇందులో చాలామంది ఒక్కరే ముద్దు ఇద్దరు వద్దు అని చెప్పారట.  కొంతమంది మాత్రం కనీసం ఇద్దరైనా ఉండాల్సిందే అంటున్నారని సర్వేలో తేలింది.  


ప్రపంచ జనాభా ఇప్పటికే 7.7 బిలియన్లుగా ఉన్నది. ఇప్పటికే భూమిపై మనిషికి చోటు దొరకడం లేదు.  అడవులను నరికేస్తున్నారు.  ఫలితంగా వర్షాభావ పరిస్థితులు వస్తున్నాయి.  కరువు కాటకాలతో ప్రజలు అల్లాడుతున్నారు.  ఇది ఇలా కొనసాగితే.. మనిషిని మనిషి పీక్కుతినే రోజులు వస్తాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: