కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు.. వేడెక్కి ఉన్నారు.. ఈ పాటను అప్పట్లో సినిమా కోసం రాసినా.. ఇప్పటి యువత మాత్రం వేడెక్కే ఉన్నారు.  కొత్తదనం కోరుకునే వారిలో ముందు ఉండేది యువతే.   అందులోను అబ్బాయిలే ఈ విషయాల్లో ముందు ఉంటారు.  కొత్తగా ఓ అమ్మాయి కాలేజీలో చేరితే.. అమ్మాయి ఎవరు ఏంటి.. ఎక్కడి నుంచి వచ్చింది.. ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా.. ఉంటె ఎంతమంది ఉన్నారు.. బాయ్ ఫ్రెండ్స్ బ్యాగ్ గ్రౌండ్ ఏంటి.. ఇవన్ని క్షణాల్లో తెలుసుకుంటారు.  ఎందుకో తెలుసా.. ఒకవేళ ఎవరైనా ఆ అమ్మయికి లైన్ వేస్తె.. ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ వచ్చి తాట వలుస్తాదేమో అనే భయం.  


ఇక కొత్త అమ్మాయి కనిపిస్తే ఆసలు వదలరు.  ఎదో విధంగా పరిచయం పెంచుకోవాలని చూస్తారు.  అమ్మాయిల తరువాత అబ్బాయిలను అమితంగా ఆకర్షించే అంశం  బైక్స్.. ట్రెండ్ కు తగ్గట్టుగా బైక్స్ వస్తున్నాయి. ఆటోమొబైల్ కంపెనీలు కొత్త కొత్త బైక్స్ ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి.  


పైగా గతంతో పోల్చుకుంటే..ఇప్పటి బైక్స్ ధర తక్కువే.  పోటి ప్రపంచంలో యూత్ ను ఆకట్టుకోవడానికి తక్కువ ధరలకే బైక్స్ ను అందిస్తున్నాయి.  అంతేకాదు, ఆయా కంపనీలే లోన్ సదుపాయాన్ని కల్పిస్తూ.. ఎంచక్కా బైక్ లను అమ్మేస్తున్నాయి.  ఇంతకంటే ఇంకేం కావాలి. ఇఎంఐ సౌకర్యం ఉన్నది కాబట్టి నెలతిరిగే సరికి ఎలాగోలా సంపాదించి కట్టేస్తుంటారు.  బైక్ కోసం ఆ మాత్రం చేయలేరా చెప్పండి.  


బైక్స్ తరువాత ఫ్యాషన్ వేర్ అంటే అబ్బాయిలు అమితంగా ఇష్టపడతారు.  పైకి చెప్పరుకాని, అమ్మాయిలకంటే అందంగా కనిపించాలని అబ్బాయిలకు ఉంటుంది.  కాని, కుదరదు కదా.  ఫ్యాషన్ వేర్స్ లో అమ్మయిలకు ఉన్నన్ని డ్రస్సులు, ఇతర యాక్ససరీస్ అబ్బాయిలకు దొరకవు.  


మొబైల్స్ :  సాంకేతికంగా ప్రపంచం అభివృద్ధి చెందాక ప్రపంచం చిన్నదైపోయింది.  ల్యాండ్ లైన్ నుంచి సెల్ ఫోన్ చేతికి వచ్చింది.  టచ్, ఆండ్రాయిడ్, ఐ ఫోన్ ఇలా ఎన్నో అందుబాటులోకి వచ్చాయి.   సెల్ చేతికి వచ్చాక కుర్రకారు జీవితమే మారిపోయింది.  వాట్సప్ పలకరింపులు.. పేస్ బుక్ గ్రీటింగులతో కాలం గడిపేస్తున్నారు.  ఏమున్నా లేకున్నా.. సెల్ ఉంటె చాలు.. అందులో నెట్ బ్యాలెన్స్ ఉంటె జిందగీ ఖుషీగా ఉంటుంది అనుకుంటున్నారు.  


ఎన్ని వేరియేషన్స్ ఉన్నప్పటికీ యూత్ ని ఆకట్టుకునే వాటిల్లో మొదటి వరసలో ఉండేది మాత్రం అమ్మాయిలే.  విద్యుత్ పుట్టాలి అంటే ఒక ప్లస్.. మైనస్ కావాలి.  అప్పుడే కరెంట్ పుడుతుంది.  అది ప్రకృతి సహజం.  


మరింత సమాచారం తెలుసుకోండి: