మేజర్ ధ్యాన్ చంద్ సింగ్  - భారతదేశ హాకీ విజార్డ్. మేజర్ ధ్యాన్ చంద్ సింగ్ 1905 ఆగస్టు 29 న ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్లో జన్మించారు. ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు


1. ధ్యాన్ సింగ్ తనకు 16 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు భారత సైన్యంలో చేరాడు, అతను నమోదు సమయం లో  హాకీని  తీసుకున్నాడు. ధ్యాన్ సింగ్ ప్రతీ రోజు రాత్రి సమయంలో  చంద్రుడి వెలుతురు లో‌   ప్రాక్టీస్ చేసేవాడు  అందుకు అతని తోటి ఆటగాళ్ళు తనని  "చంద్" అని పిలిచేవారు. అలా ఆయన పేరులో చంద్ వచ్చి చేరింది.

2. 1928 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్లో ధ్యాన్ చంద్ 14 గోల్స్ సాధించిన ఏకైక గోల్ స్కోరర్.  అప్పట్లో  ఒక వార్తా పత్రిక  “ఇది హాకీ ఆట కాదు, ఒక మేజిక్ లా ఉంది, ధ్యాన్ చంద్, నిజానికి, హాకీ మాంత్రికుడు. ” అని భారతదేశం విజయం‌పై స్పందించింది.

3. ధ్యాన్ చంద్ తన కెరియర్ లో చాలా మ్యాచ్‌లలో పాల్గొన్నప్పటికీ, అతను ఒక  హాకీ మ్యాచ్‌ను మాత్రం‌  తనకు ఎంతో ఇస్టమైనదిగా చెప్పేవాడు. "నేను ఆడిన ఉత్తమ మ్యాచ్ ఏది అని ఎవరైనా నన్ను అడిగితే, ఇది కలకత్తా కస్టమ్స్ మరియు ఝాన్సీ హీరోస్ మధ్య జరిగిన 1933 బీటన్ కప్ ఫైనల్ అని నేను అనాలోచితంగా చెబుతాను." అని చెప్పేవాడు.

4. 1932 ఒలింపిక్స్‌లో భారత్‌ యూఎస్‌ఏను 24-1తో, జపాన్‌ను 11-1తో ఓడించింది. భారత్ సాధించిన 35 గోల్స్‌లో ధ్యాన్ చంద్ 12 గోల్స్ సాధించగా, అతని సోదరుడు రూప్ సింగ్ 13 గోల్స్ చేశాడు. అప్పటి నుండి వారిని 'హాకీ కవలలు'గా  పిలిచేవారు.

5. ఒకసారి, ధ్యాన్ చంద్ ఒక మ్యాచ్‌లో స్కోరు చేయలేకపోయాడు, అతను గోల్ పోస్ట్ ను కొలవకుండానే  కొలత గురించి మ్యాచ్ రిఫరీతో వాదించాడు.  ప్రతి ఒక్కరి ఆశ్చర్యానికి, దానిని కొలవగా గోల్ పోస్ట్ అంతర్జాతీయ నిబంధనల ప్రకారం సూచించిన అధికారిక కనీస వెడల్పుకు లేదని తేలింది. ఈ విషయం‌చాలామందిని సంబ్రమాశ్చర్యాలలో ముంచింది హాకీ లో  తనకు ఉన్న అనుభవం తెలపడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.

6. 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో భారతదేశం  మొదటి మ్యాచ్ తరువాత, ఇతర క్రీడలను చూసే ప్రజలు కూడా హాకీ స్టేడియానికి చేరుకున్నారు. ఒక జర్మన్ వార్తాపత్రిక ఇలా రాసింది 'ఒలింపిక్ కాంప్లెక్స్‌లో ఇప్పుడు మ్యాజిక్ షో కూడా ఉంది, భారతీయ ఇంద్రజాలికుడు ధ్యాన్ చంద్ ఆటను చూడటానికి హాకీ స్టేడియం వెళ్ళండి."

7. కొన్ని కధనాల ప్రకారం, జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ బెర్లిన్ ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత ధ్యాన్ చంద్ కు జర్మన్ పౌరసత్వాన్ని, జర్మన్ మిలిటరీలో ఒక స్థానాన్ని ఇచ్చాడు కానీ ధ్యాన్ సింగ్ దానిని సున్నితంగా  తిరస్కరించారు.

8.  ధ్యాన్ చంద్ తన కెరీర్లో 22 సంవత్సరాల లో (1926-48) మొత్తం 400 గోల్స్ చేశాడు.

9. నెదర్లాండ్స్‌లోని హాకీ అధికారులు ఒకసారి అతని హాకీ స్టిక్  లోపల అయస్కాంతం ఉందా అనే అనుమానం తో తన హాకీ స్టిక్ విరగ్గొట్టి  తనిఖీ చేశారు.
10.  అయన 42 సంవత్సరాల వయస్సు వరకు హాకీ ఆడారు, 1948 లో  హాకీ నుండి రిటైర్ అయ్యారు. ఆస్ట్రియాలోని వియన్నా నగరం ఆయన కి అరుదైన గౌరవం ఇచ్చి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి సత్కరించింది. ఈ  క్రీడాకారుడి ఇతర విగ్రహాలు న్యూ ఢిల్లీ లో, ఆంధ్రప్రదేశ్ లోని మెదక్ వద్ద ఉన్నాయి. ఆయన కి 1956 లో  పద్మ భూషణ్ అవార్డు తొ‌ సత్కరించారు. ఆగస్టు 29 న ఆయన పుట్టినరోజు భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు. అతను డిసెంబర్ 3, 1979 న తుదుశ్వాస విడిచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: