కీటకాలల్లో అత్యంత ప్రమాదకరమైనవి దోమలు. ఇది వర్షాకాలంలో విపరీతంగా వృద్ధి చెందుతాయి. చిన్న చిన్న కాలవ‌ల‌ నుంచి పెద్ద జలాశయాల వరకు ఎక్కడైనా వృద్ధిచెందుతాయి. ఆడదోమ‌ పురుషులు, పశువులు రక్తాన్ని పిలుస్తుంది. మగ దోమ‌ కేవలం మొక్కల రసాన్ని పీల్చుకుంటుంది.పెరుగుతున్న జనాభా వల్ల కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోతున్నది. ఫలితంగా దోమల సంఖ్య పెరుగుతున్నది.


నీళ్లు ప్రవహించకుండా ఒకచోట ఎక్కువకాలం నిల్వ ఉంటే అవి దోమలకు ఆవాస స్థలాలుగా మారతాయి. ఈ పరిస్థితి పల్లెల్లో కన్నా పట్టణాల్లో ఎక్కువగా ఉంది. దీంతో వ్యాధుల సంఖ్య కూడా పెరుగుతున్నది. దోమకాటు వలన మలేరియా, చికెన్‌గునియా, డెంగు వంటి విషజ్వరాలు వస్తాయి. ప్రతి సంవత్సరం కనీసం 30 శాతం మంది ఇలాంటి విషజ్వరాలు భారిన పడుతున్నారని అధ్యయనాల్లో వెల్లడైంది. ఇలాంటి విషజ్వరాలు ప్రబలకుండా ఉండాలంటే దోమలను నియంత్రించడం ఒక్కటే మార్గం.


- కీటకాలను నాశనం చేసే స్ప్రే లేదా అగరబత్తీలు వెలిగించడం బెటర్. ఇంట్లోని వారికి శ్వాస సంబంధిత రుగ్మతలు ఉంటే కనుక వారికోసం రసాయన రహితమైన ఉత్పత్తులను కొనుగోలు చేయండి. 


- దోమలను దరి చేరనివ్వకుండా చేసే క్రీమ్స్, లోషన్స్ ఒంటికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు.


- కొబ్బరి నూనె, ల్యావెండర్ నూనె, లవంగ నూనె, నీలగిరి తైలం, తులసి ఆకుల రసం, వేప నూనె, పుదీనా రసం, వెల్లుల్లి రసం వంటి శరీర భాగాలు పట్టిస్తే దోమలు దరిచేరవు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు వీటిని ఉపయోగించవచ్చు.


- ఈ రోజుల్లో చాలా కంపెనీలు ఆయుర్వేదిక్ లోషన్స్, క్రీమ్స్ ను తయారుచేస్తున్నాయి. ఇవి శరీరానికి ఎలాంటి హానీ చేయవు కాబట్టి నిర్భయంగా వీటిని వాడుకోవచ్చు.


- గదిలోకి దోమలు రాకుండా ఉండాలంటే కర్పూరం లేదా నీలగిరి తైలాన్ని మండించండి. దీనివల్ల గదిలోకి ఎలాంటి పొగ రాదు. కేవలం వాస‌న‌ మాత్రమే వస్తుంది. ఈ వాసన ఉన్నచోటకు దోమలు అస్స‌లు రావు.


- ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో ఒంటికి నిండుగా దుస్తులు ఉండేలా జాగ్రత్త పడండి. దీని వల్ల దోమలు కుట్టకుండా కొంచెం జాగ్రత్త పడొచ్చు. మ‌రియు రాత్రి పడుకునే ముందు గది తలుపులు వేసిన తర్వాత దోమల బ్యాట్‌ను ఒక్కసారి ఉపయోగించండి.


- సాయంత్రం అవ్వడంతో కిటికీ తలుపులు, ద‌ర్వాజాల‌ను మూసివేయండి. ఇలా చేస్తే దోమలు లోపలికి రాకుండా కొంతవరకు నివారించవచ్చు.


- నీళ్ళు నిల్వ ఉండే చోట్ల వాసన రాకుండా ఉండడానికి క్లోరిన్ పౌడర్ లేదా మీ వార్డు సభ్యునికి తెలియజేసి క్లీన్ చేయించుకోండి. ఎల్లప్పుడూ కూడా చుట్టుపక్కల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.


- ముఖ్యంగా మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వర్షపు నీటిని, మురికినీటిని లేకుండా చూసుకోండి. దీని వల్ల దోమలు త్వరగా వ్యాప్తి చెందుతాయి. క‌నుక త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ఎలాంటి ప్ర‌మాద‌క‌ర‌మైన జ‌బ్బులు రాకుండా ర‌క్షించుకోవ‌చ్చు.  



మరింత సమాచారం తెలుసుకోండి: