ప్ర‌స్తుత స‌మాజం కంప్యూటర్స్‌ లేకపోతే మనిషి లేడు.. ప్రపంచం లేదు అనే రీతిలో మారిపోయింది. ఇప్పుడు చాలా మంది కంప్యూటర్స్‌ ముందే కూర్చుని ఎక్కువ సేపు పనిచేయడం వలన అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారు. కంప్యూటర్‌ను అతిగా ఉప‌యోగించే వారికి మెదడుపైన , కళ్ళపైన , శరీర కదలిక అవయవాలపైన అది ప్రభావాన్ని చూపిస్తుంది. 


ముఖ్యంగా ఇలాంటి వారికి కంటి స‌మ‌స్య‌లు ఎక్కువ వ‌స్తుంటాయి. క‌ళ్లు మంట‌, క‌ళ్ల నుంచి నీరు రావ‌డం,  క‌ళ్లు పొడిబార‌డం, దుర‌ద‌, న‌ల్ల‌టి వ‌ల‌యాలు, వేడి అనిపించ‌డం ఇలా అనేక కంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. అలాంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే అనేక కంటి స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. మ‌రి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


- క‌మ‌లాపండు ర‌సంలో కొద్దిగా పాలు క‌లిపి బాగా మిక్స్ చేసి క‌ళ్ల కింద సున్నితంగా మ‌సాజ్ చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ళ్లు మంట‌లు త‌గ్గుతాయి.


- దూదిని కొబ్బరి నూనెలో ముంచి కళ్లు మూసి కనురెప్పలపై ఆ దూదిని ఉంచాలి. అలా 10 నిమిషాల చేయ‌డం వ‌ల్ల క‌ళ్ల‌కు రిలీఫ్ అయిన‌ట్టు ఉంటుంది.


- ప్ర‌తిరోజు ప‌డుకునే ముందు అల్మండ్ క్రీమ్‌ను కంటి చుట్టూ రాసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ళ్ల కింద ఉన్న న‌ల్ల‌టి వ‌ల‌యాలు త‌గ్గిపోయి అందంగా మార‌తాయి.


- అలోవెర జెల్‌ను క‌ళ్లు మూసి క‌నురెప్ప‌ల‌పై అప్లై చేసి కొంత స‌మ‌యం త‌ర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ళ్లు పొడి బార‌కుండా ఉంటాయి.


- రోజ్ వాట‌ర్‌లో దూదిని ముంచి కళ్ల‌పై ఉంచుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అనేక కంటి స‌మ‌స్య‌లకు చెక్ పెట్ట‌వ‌చ్చు.


- ప్ర‌తి రోజు రాత్రి ప‌డుకునే ముందు కీరాదోస ర‌సాన్ని కంటి చుట్టూ అప్లై చేయాలి. త‌ర్వాత రోజు మార్నింగ్ క్లీన్ చేసుకోవాడం వ‌ల్ల కంటి కింద మ‌చ్చ‌లు త‌గ్గుతాయి.


- మీ కళ్ళు ఒత్తిడిగా ఉన్నాయని భావిస్తే చ‌ల్ల‌టి వాట‌ర్‌తో కళ్ల‌ను శుభ్రం చేసుకోవాలి. చ‌ల్ల‌టి నీటితో మీ కళ్ళు కడగటం వల్ల అధిక ఒత్తిడి నుండి మీ కళ్ళు ఉపశమనం పొంద‌వ‌చ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: