ఇడ్లీ దక్షిణ భారత దేశంలో విరివిగా వాడే అల్పాహార వంటకం. ఉదయం లేవగానే తయారు చేసేందుకు సులువగా, తినేందుకు వీలుగా ఉండేది ఇడ్లీ మాత్రమే. పొద్దున్నే ఇడ్లీని మించిన టిఫిన్ లేదంటున్నారు డాక్టర్లు. ఉదయం సేవించే అల్పాహారాల్లో మొదటి స్థానంలో ఇడ్లీనే ఉంటుంది అంటే కేవలం తినడానికి, చెయ్యడానికి సులువని మాత్రమే కాదు రుచిలో కూడా రారాజు అని.. దీన్ని చట్నీతో తిన్నా, సాంబార్‌తో తిన్నా, నెయ్యితో తిన్నా, కారప్పొడితో తిన్నా వారెవ్వా అనాల్సిందే. ఇడ్లీ ఆవిరి పద్ధతిలో తయారవుతుంది.


ఇదుంలో నూనె వాడకపోవడంతో ఇది శరీరంలో ఎలాంటి కొవ్వుని జమచేయదు.  కాలరీలు తక్కువ. లావుగా ఉన్నవారికి సరైన అహారమిది ఉదయం పూట. నాలుగు ఇడ్లీలు తీంటే, 33 మిల్లి గ్రాముల కాల్షియమ్, 31 మిల్లి గ్రాముల కార్బోహైడ్రేట్లు, 0.5 మిల్లి గ్రాముల కొవ్వు, 16 మిల్లి గ్రాముల ఐరన్, 14 మిల్లి గ్రాముల విటమిన్ బ3, 0.08 మిల్లి గ్రాముల విటమిన్ బి2, 0.14 మిల్లి గ్రాముల విటమిన్ బి1, 0.05 మిల్లి గ్రాముల విటమిన్ A, 6.7 గ్రాముల ప్రొటిన్స్, 157 కాలరీలు మన శరీరానికి అందుతాయి.


ఇడ్లీ త్వరగా జీర్ణం అయిపోవడమే కాకుండా పొట్ట తేలికగా ఉంటుంది. ఇడ్లీ తింటే ఆరోగ్యానికి కావాల్సిన ప్రొటీన్లన్నీ శరీరానికి పుష్కలంగా అందుతాయి. ఇడ్లీ తినడం వల్ల అనారోగ్యం తగ్గి, చక్కటి ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు. అందుకే జ్వరమొచ్చినా, జాలుబొచ్చినా డాక్టర్లు అన్నం తినకుండా ఇడ్లీ మాత్రమే తినమని చెప్తారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: