ఈ ప్రపంచంలో దోమలతో  కుట్టించుకోని మనిషి ఎక్కడ ఉండదు. ఎక్కడో ఒక చోట దోమ కాటుకి చర్రుమని చరుచుకునే వాళ్ళు సెకనుకు లెక్కపెట్టలేనంత మంది ఉంటారు. ఈ దోమ దెబ్బకి కింగ్ లా ఉండే మనిషి మలేరియా, టైఫాయిడ్ అంటూ నీరసించి పోతారు, మంచాన పడిపోతారు. అయితే మనల్ని కుట్టే దోమలు మన పక్కనే ఉన్న కొంత  మందిపై దాడి చేయవు. ఎందుకో తెలుసా.   

 

దోమలకి ఉదయం కళ్ళు పెద్దగా కనిపించవు అందుకే ఉదయం సమయంలో వాటి దాడి పెద్దగా ఉండదు. ఇకపోతే సాయంత్రం అయ్యే సరికి వాటి కళ్ళు తెరచుకోవడం మొదలు పెడుతాయి. రాత్రికి పూర్తిగా దాడికి సిద్దం అవుతాయి. అయితే ఈ క్రమంలోనే అవి మనల్ని కుట్టినా మన పక్క నే ఉన్న వారిని టచ్ కూడా చేయవు ఎందుకంటే. దోమలకి లైట్ కలర్  డ్రెస్ వేసుకునే వాళ్ళకి పెద్దగా ఎట్రాక్ట్ అవ్వవు. కానీ డార్క్ కలర్ డ్రస్ వేసుకున్న వాళ్ళపై మాత్రం మూకుమ్మడిగా దాడి చేస్తాయి. దోమలు డార్క్ కలర్స్ కి ఎక్కువ ఆరక్షణకి  లోనవుతాయట. కాబట్టి లైట్ కలర్ డ్రస్స్ లు వేసుకోవడం ఎంతో ఉత్తమం.

 

అంతేకాదు దోమలు కార్బడైఆక్సైడ్ ని ఎక్కువగా పీల్చుకుంటాయి. ఎంత దూరంలో ఉన్నా సరే  కార్బడైఆక్సైడ్ ఎక్కువగా విడుదల చేసే వారు వాటికి ఇట్టే తెలిసి పోతారట.  మనలో లావుగా  అధిక బరువు కల వారు కార్బడైఆక్సైడ్ ఎక్కువగా విడుదల చేస్తారు. దాంతో అలాంటి వారిపై కూడా దోమలు దాడి అధికంగా ఉంటుందట. చెమట వాసన వచ్చే వారి వద్దకి దోమలు క్యూ కడుతాయట. అలాంటి వారిని అధ్యదికంగా కుడతాయని ఓ అధ్యయనంలో కూడా తేలిందని అంటారు.చెమట వాసన అధికంగా వచ్చేది మందు బాబుల వద్దే కాబట్టి మందు బాబులు బీ కేర్ ఫుల్.ఇక పరిసరాల శుభ్రత అనేది ఎంతో ముఖ్యమైనది దోమలని నివారించడంలో. మరి దోమల బారి నుంచీ తప్పించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పటికే అర్థం అయ్యింది కదా...ఆచరణలో పెట్టేయండి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: