ప్రపంచ పర్యాటక దినోత్సవంను ప్రతి సంవత్సరం సెప్టెంబరు 27వ తేదీన జరుపుకొంటార‌రు. 1980 నుండి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ పర్యాటకం ఆర్గనైజేషన్ ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను ఘ‌నంగా నిర్వ‌హించుకోవాల‌ని ప్ర‌క‌టించింది. ఈ తేదీని 1970 లో ఒక రోజున ఎంపికచేశారు, UNWTO విధానాలను అనుసరించి ఈ రోజును స్వీకరించడం జరిగింది. ఈ విధానాన్ని అవలంభించడాన్ని ప్రపంచ పర్యాటకానికి సంబంధించిన ఒక మైలురాయిగా భావిస్తారు.
నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సంద‌ర్భంగా  ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తే అక్కడి అందాలు చూసి ఎంతో మురిసిపోతాం. అలాంటి అందాలు చూడ‌డం వ‌ల్ల ఎన్నో కొత్త కొత్త విష‌యాల‌ను నేర్చుకోగ‌లం. అక్కడి మనుషులు, వారి సంస్కృతి, వారి జీవనోపాధి ఏంటి ? ఎలా సంపాదిస్తున్నారు?  వారి జీవ‌నం ఎలా కొన‌సాగుతుంది..? ఈ చిన్న ప్రయాణం మనపై ఎలాంటి మంచి ప్రభావం చూపింది? అనే ఉద్దేశ్యాలతో ప్రతీ ఏడాది సెప్టెంబర్ 27ను ప్రపంచ పర్యాటక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు ప్రత్యేకతను గుర్తించి మన భార‌త్‌లోనే కొన్ని మంచి పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

Related image

ఇండియాకి ఉత్తర వైపు ఉండే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచ వింతల్లో ఒకటైన, ప్రేమకు చిహ్నంగా పేరున్న‌ తాజ్ మహల్ ఆగ్రాలో ఉంది. ప్రసిద్ధ శైవక్షేత్రం వారణాసి, గంగానదీ ఇక్కడే ఉంది. అయితే ఇంకాస్త ఎగువ రాష్ట్రానికి వెళ్తే హిమాచల్ ప్రదేశ్ లో మనాలి, కసౌలి, ధర్మశాల వంటి  ప్రదేశాలు చూడొచ్చు. హిమాలయాలకు అనుకోని ఉన్నాయి కాబట్టి అక్కడి సహజసిద్ధమైన మంచు, ప్రకృతిని ఆస్వాదించవచ్చు.

Image result for beautiful location in <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=KERALA' target='_blank' title='click here to read more'>kerala</a> images

ద‌స‌రా సీజ‌న్ వ‌చ్చిదంటే..
దసరా సీజన్ వచ్చిందంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ముఖ్యంగా కోల్ కతా నగరంలో ఉండే ఆ సంద‌డే వేరు. దుర్గా దేవి పూజ, నవరాత్రులు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ హౌరా బ్రిడ్జ్ సహా ఎన్నో చూడదగ్గ ప్రదేశాలున్నాయి. అలాగే గుజరాత్ లోని రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఉప్పుతో కూడిన నేలలు అలాగే ఇక్కడి గిర్ అటవీ ప్రాంతం తప్పకుండా చూడాల్సిన ప్ర‌దేశాలు. అలాగే రాజస్థాన్ రాష్ట్రంలోని పింక్ సిటీగా పిలువబడే జైపూర్, అలాగే థార్ ఎడారి కూడా ఇక్కడే ఉంది. 

Image result for karnataka maharashtra konkani train beautiful

ఇక్క‌డ మ‌ర్చిపోలేని అనుభూతి:
కర్ణాటక - మహారాష్ట్ర- గోవా రాష్ట్రల సరిహద్దుల మధ్య కొంకణ్ ప్రాంతంలో రైలు ప్రయాణం జీవితంలో మర్చిపోలేని అనుభూతి క‌లుగుతుంది. ఒకవైపు పచ్చని గడ్డిమైదానాలు, ఇంకో వైపు కొండలు, చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే మరోవైపు అరేబియా సముద్రం కూడా ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: