సాధార‌ణంగా క‌రివేపాకు ఎరుగ‌ని వారుండ‌రు. నిత్యం వంట‌ల్లో వాడే క‌రివేపాకు సహజ సువాసనతో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా అధికం. పురాతన కాలం నుంచి భారతీయలు తమ వంటకాల్లో కరివేపాకును ఎక్కువగా వాడుతున్నారు. కరివేపాకు వంటలకు చక్కని రుచిని అందిస్తుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా వీటిలో ఉంటాయి. అయితే వంటలో కలిపిన కరివేపాకు తినటం వ‌ల్ల‌ చాలా ఆరోగ్య ప్రయోజనాలను కల్గుతాయి అంటున్నారు ఆరోగ్యనిపుణులు.


రోజు భోజనంలో కలిపిన కరివేపాకు తినటం వలన మూత్రపిండ సమస్యలు తగ్గుతాయి అంటున్నారు నిపుణులు. మూత్రపిండాలలో రాళ్లు కలిగి ఉండే వారు కూడా కరివేపాకు రసాన్ని తాగితే మంచి ఫలితాలు వస్తాయి అంటున్నారు నిపుణులు. కరివేపాకు ఆకులను నలిపి, మజ్జిగలో లేదా నీటిలో కలుపుకొని తాగటం వలన అజీర్ణం నుండి ఉపశమనం పొందుతారు.


అలాగే క‌రివేపాకును ఆహారంలో చేర్చుకోవ‌డం వ‌ల్ల అధిక ఆమ్లశ్రావం, జీర్ణ పూతల, డయాబెటిస్ మరియు అనారోగ్య కొలెస్ట్రాల్ సంతులనం , అతిసారం, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలను నియంత్రించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. అదే విధంగా కరివేపాకు ఆకులు క్యాన్సర్ పోరాట లక్షణాలను కలిగి ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: