ఓ బామ్మ ఆరు ఇడ్లీ తింటేనే రికార్డా మేము తింటాం ఆరు ఇడ్లీ అనుకోకండి. ఆరు ఇడ్లీ కేవలం 60 సెకన్లలో తినేసింది. పైగా రెండు మూడు సెకన్లు మిగిలి ఉన్నాయి కూడా దాంతో ఈ పోటీలలో బామ్మ మొదటి బహుమతి ఎగరేసుకుపోయింది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వాళ్ళు బామ్మ స్పీడు చూసి షాక్ తిన్నారు కూడా. ఈ ఇడ్లీ రికార్డ్ ఏంటి..?? అసలు ఎందుకు ఇదంతా అనుకుంటున్నారా..?? సరే అసలు విషయంలోకి వెళ్తే..

 

కార్ణాటకలో సాంప్రదాయ పద్దతిలో ప్రతీ ఏడాది దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ పోటీలు జరుగుతాయి. అయితే ఈ  ఇడ్లీ పోటీలు కేవలం ఆడవారికి మాత్రమే. పురుషులకి నో ఎంట్రీ. కేవలం వారు ప్రేక్షక పాత్ర పోషించడమే. ఎప్పటిలానే ఈ పోటీలని ఎంతో వైభవంగా ఏర్పాటు చేశారు. ఊహించిన విధంగా భారీ స్థాయిలో మహిళలు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే 60 ఏళ్ళ సరోజమ్మ కూడా పాల్గొంది.

 

 

బామ్మా ఏమి తింటుందిలే అనుకున్నారు అందరూ, ఆమె పోటీలో ఉండటం చూసి అందరూ నవ్వుకున్నారు. ఇక పోటీ ప్రారంభం అయ్యింది. పళ్ళెంలో 6 ఇడ్లీలు, నంచుకోవడానికి సాంబార్ సిద్దంగా ఉన్నాయి. రెడీ స్టార్ట్ అనగానే బామ్మ గుటుక్కు గుటుక్కు మంటూ అమాంతం 6 ఇడ్లీలు లాగించేసింది. ఒక్క సారిగా నిర్వాహకులు , పోటీలో పాల్గొనడానికి వచ్చిన వారు కళ్ళప్పగించి ఆమె వైపు చూస్తూ ఉండిపోయారు. ఇంకా రెండు మూడు సెకన్ల సమయం ఉండగానే ఆమె ఆ రికార్డ్ బద్దలు కొట్టింది. దాంతో వామ్మో బామ్మా అంటూ ఆమెకి మొదటి బహుమతి ఇచ్చేశారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: