ఓ షాపులో దొంగతనం జరిగింది. ఆ షాపు యజమాని ఫిర్యాదు తో పోలీసులు ఓ పక్షిని అరెస్ట్ చేశారు. అంతేకాదు ఈ విషయాన్ని ఎంతో గొప్పగా సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. దాంతో నెటిజన్లు సదరు పోలీసుల ప్రవర్తనపై కళ్ళెర్ర జేస్తున్నారు. పక్షిని అరెస్ట్ చేయడం ఏమిటి దిమాక్ ఖరాబ్ అయ్యిందా అంటూ ఫైర్ అవుతున్నారు. దొంగతనం పక్షి చేయడం ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ అసలు ఆ పక్షి చేసిన నేరం ఏమిటి..?? వివరాలలోకి వెళ్తే..

 

నెదర్లాండ్స్ లో ఓ షాపులో దొంగతనం జరిగింది అయితే పోలీసులు ఓ అనుమానిత వ్యక్తిని అరెస్ట్ చేశారు. దొంగతనం జరిగిన సమయంలో ఆ వ్యక్తి భుజంపై పక్షి కూడా ఉండటంతో పోలీసులు సదరు పక్షిని కూడా అరెస్ట్ చేయడంతో పాటు జైలులో పెట్టారు. నేరంలో ఆ పక్షికి కూడా భాగం ఉందని అనుమానంతోనే పక్షిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. అయితే

 

పక్షిని అరెస్ట్ చేసిన విషయాన్ని ఎంతో గొప్పగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అంతేకాదు దాని ఆకలి  తీర్చడానికి మేము రొట్టెలు పాలు ఇస్తున్నాం అంటూ వెటకారంగా పోస్ట్ చేశారు. దాంతో పక్షి ప్రేమికులు సదరు పోలీసులపై విరుచుకు పడ్డారు. దొంగని పట్టుకోవడం చేతకాకపోతే ఇలాంటి పనులే చేస్తారు అంటూ కామెంట్స్ చేశారు. వెంటనే విడుదల చేయకపోతే దీనిపై కోర్టులకి వెళ్తామని అంటున్నారు నెటిజన్లు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: