వర్షాకాలం వచ్చేసింది. చిన్నపిల్లలు అయితే వర్షం సినిమా చూసి అందులోలా ఎగరాలి, తడవాలి అని అనుకుంటారు. కానీ పెద్దలకు బాగా తెలుసు. వర్షం తడిస్తే ఎన్ని సమస్యలువస్తాయి అనేది. అందుకే పిల్లల్ని, వారు వర్షంలో తడవకుండా చూసుకుంటారు. తడవకుండా ఉందతని ఎంత ప్రయతించిన సరే ఎలాగోలా తడుస్తాం. అంతే కాదు వర్షం వల్ల వచ్చే దోమలకు మనం ఆహారమవుతాం. 


ఈ వర్షాలు చిన్న పడిన సరే రోడ్లన్నీ బురదమయమై, వాటిపైగల చెత్తచెదారం కుళ్లి.. వాటి కారణంగా ప్రాణంతక వైరస్‌లు, బాక్టీరియా వ్యాపిస్తాయి. ఈ రోజుల్లోనే దోమల బెడదా బాగా పెరుగుతుంది. పరిశుభ్రత లోపించటం వల్ల శ్వాస, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా ఈరోజుల్లో చాలా వస్తాయి. అందుకే ఈ వానాకాలంలో ఆరోగ్య పరిరక్షణన కోసం వాస్తవ పరిస్థితికి అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 


జాగ్రత్తలు.. 


ఇంటి పరిసరాల్లో వాననీరు నిల్వ కాకుండా చూసుకోవాలి.


ఇంట్లో చేరిన బూజు, దుమ్ము, ధూళిని పూర్తిగా తొలిగించాలి, ఇలా చెయ్యడం వల్ల శ్వాసకోశ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.


ఈ సీజన్లో అతిగా కాఫీ,టీ బదులు గోరువెచ్చటి నీరు తాగటం మంచిది. రోజుకు కనీసం 8 గ్లాసులు తాగాలి.


వానలో తడిస్తే ఇంటికి రాగానే తలతుడుచుకోవాలి. వేడినీటితో తల స్నానం చేస్తే మంచిది.


వర్షాకాలంలో మిరియాలపొడి వేసిన సుప్ వేడిగా తీసుకోవాలి.


ఆకుకూరలు, కూరగాయాలు ఉప్పు నీళ్లతో కడిగి వాడుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: