తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని మారేడుమిల్లి- చింతూరు   మధ్య ఓ పర్యాటక బస్సు బోల్తాపడింది. భ‌ద్రాచ‌లం నుంచి రాజ‌మండ్రికి వెళ్తోన్న ప్రైవేట్ ట్రావెల్స్  బ‌స్సు ఘాట్ రోడ్డులో అదుపు త‌ప్పి లోయ‌లో ప‌డిపోయింది. ఈ ఘటన లో ఎనిమిది మంది మృతి చెందగా ,  మిగిలిన వారు  తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరిద్దరి  పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది . ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లో మొత్తం 12  మంది ఉన్నట్లు , వీరంతా భద్రాచలం లో దైవ దర్శనం అనంతరం రాజమండ్రికి బయల్దేరిన కొద్ది సేపటికే ప్రమాదం బారిన పడినట్లు తెలుస్తోంది .


ఘాట్ రోడ్డు లో  వాల్మీకి కొండ వద్ద బస్సు అదుపు తప్పడం వల్ల  ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులకు సహాయక చర్యలు అందించడానికి  సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా అందుబాటి లేకపోవడం వల్ల, సహాయక సిబ్బందికి  ఇబ్బందులు తతెత్తుతున్నట్లు తెలుస్తోంది . బస్సు ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న  మారేడుమిల్లి పోలీసులు సంఘ‌ట‌నా స్థలానికి  హుటాహుటిన బ‌య‌లుదేరారు .  మారేడుమిల్లి స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ శివ‌రామ‌కృష్ణ అద్వర్యం లో  పోలీసు బృందం స‌హాయ కార్య‌క్ర‌మాల చేపడుతున్నారు. పర్యాటకులంతా కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లాలోని చెలకెరి గ్రామస్థులుగా గుర్తించారు .


భద్రాచలం లో దైవ  దర్శనం అనంతరం అన్నవరం వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది . మారేడుమిల్లి- చింతూరు  లోయలు , గుట్టలతో ప్రమాదకరంగా ఉంటుందని , ఇటీవల కురిసిన వర్షాలతో ఈ రహదారి మరింత ప్రమాదకరంగా మారిందని అంటున్నారు . అనుభవజ్ఞులైన డ్రైవర్లు మాత్రమే ఈ రహదారి లో వాహనాలు ఎక్కువగా నడుపుతుంటారని , కొత్తవారైతే ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువేనని పోలీసులు అంటున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: