గుమ్మడి ఆంధ్రులకు ప్రీతికరమైన శుభప్రథమైనది. ఇది ప్రపంచములో అన్ని దేశాలలో దొరుకుతుంది. గుమ్మడిలో అద్భుత ఔషధాలున్నాయి. గుమ్మడి కాయను భారత సంప్రదాయక వంటకాలలో దీనికి మంచి స్థానమే ఉంది. ఇందులోని పదార్థాలు వివిధ రోగాలను నివారించే గుణం కలిగి ఉండడం విశేషం. గుమ్మడి ప్రొస్టేట్ గ్రంథుల వాపును తగ్గించడానికి వైద్య పరంగా సరిపోతుంది. అలాగే మలబద్దకంతో బాధపడే వాళ్ళు రోజూ బూడిద గుమ్మడికాయను ఆహారంలో భాగంగా తీసుకుంటుంటే మలబద్దకం తగ్గుతుందట. 


అంతేకాదు ఈ విత్తనాల నుంచి తీసిన నూనెని చర్మవ్యాధుల నివారణలో వాడుతుంటారు. ఇంకా బూడిదగుమ్మడి తీగ రసాన్ని హై బి పి , నిద్రలేమితో బాధపడేవారికి ఇస్తే మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెప్తోంది. ఇందులో చాల ఎక్కువగా "బీటా కెరోటిన్ ఉంటుంది, శరీరానికు తక్కుకా క్యాలరీలు అందిస్తుంది . కళ్ళకు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది . ఇందులో విటమిన్ సి కుడా సంవృద్దిగా లభిస్తుంది. 


డయాబెటీస్ రాకుండా ఉండేందుకు, వచ్చిన వారికి కుడా గుమ్మడి ఎంతో మంచిది . బి.పి.ని నియంత్రిస్తుంది, పీచు పదార్ధము ఎక్కువగా ఉన్నందున కొలెస్టరాల్ను తగ్గిస్తుంది, గుమ్మడి విత్తనాలను ఎండబెట్టి పొడిచేసి నీళ్ళలో కలిపి తాగితే మూత్ర సంభంద వ్యాధులు తగ్గుతాయి. రచూ గుమ్మడిని తీసుకోవడం వలన గ్యాస్ట్రిక్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఛాతీ నొప్పి, ఊపిరితిత్తుల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: