ఒక టీచర్ తన క్లాస్ లోని పిల్లలను పిలిచి " మీరంతా రేపు తలా ఒక ఒక సంచి, కొన్ని టమోటాలు తీసుకురావాలి. ఒక్కో టమోటాలు కూ మీకిష్టం లేని వాళ్ళ పేరు పెట్టాలి. అంటే మీకేంతమంది మీద అయిష్టం ఉందో అన్ని టమోటాలు తేవాలి అన్నమాట."  అని చెప్పారా టీచర్..

 

రెండో రోజు పిల్లలంతా సంచిలో టమోటాలు తో క్లాస్ కి వచ్చారు. కొందరు 2 టమోటాలు ఇంకొందరు 3 కొందరైతే 5 టమోటాలు దాకా కూడా తెచ్చారు." పిల్లలూ మీరంతా ఇలా ఈ సంచిలో టమోటాలు ను రోజంతా మీతోనే ఉంచుకోవాలి.

 

మీరెక్కడికి వెళితే అక్కడికి అంటే టాయ్లెట్ కి వెళ్ళినా వెంట తీసుకు వెళ్ళాలి. అర్థం అయ్యిందా? “అని చెప్పారు టీచర్.

 

ఇలా ప్రతి రోజూ టీచర్ చెప్పినట్లు ఆ సంచి మోస్తూ పిల్లలు బాగా ఇబ్బంది పడ్డారు. టమోటాలు కుళ్ళి వాసనేస్తోంది టీచర్అని కంప్లైంట్ కూడా చేసారు.అయినా ఆ కంపు భరిస్తూ, బరువులు మోస్తూ పిల్లలంతా దిగాలుగా ఉండసాగారు.

 

కొన్ని రోజులు గడిచినాక టీచర్ చెప్పగానే పిల్లలందరూ వెళ్లి టమోటాలు సంచులు బయట పారేసి వచ్చారు.“మీ అనుభవాలు చెప్పండి."అన్న టీచర్ మాటతో పిల్లలందరూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. 

 

ఆ బరువు, కంపు వెంట తీసుకు వెళ్ళడంలో తాము పడ్డ పాట్లు వివరించారు.“అవును కదూ పిల్లలూ ? మీరు ఈ కొద్ది రోజులు మోసిన ఈ కుళ్ళు టమోటాలు కూ, మీ మనస్సులో మోసే ఇతరుల పట్ల ద్వేషానికీ ఏ విధమైన తేడా లేదు. మీరు మోసిన టమోటాలు కుళ్ళి వాసన వచ్చినట్లే.

 

ఇతరుల పట్ల ద్వేషం మీ మనసును కలుషితం చేస్తుంది.దాన్ని మీరు వెళ్ళిన ప్రతి చోటికీ మీరు మోసుకు వెళ్తూనే ఉంటారు. కాసిని టమోటాలు ను ఒక వారం రోజులే మొయలేక పోయారే మరి జీవితకాలం ద్వేషం మోయడం ఎంత కష్టమో ఊహించ గలరా ? అంటే మనం ఇతరులను ద్వేషిస్తే మన మనస్సు పాడవుతుంది. 

 

మన మనస్సు పాడయితే మన బ్రతుకు పాడవుతుంది. ఇతరులను ద్వేషించడం పాపమయితే, ఇతరులను ప్రేమించడం పుణ్యం అన్నమాట. మరి మీరు ద్వేషాన్ని వదిలేస్తారు కదూ ? "అడిగారా టీచర్.పిల్లలందరూ ఇంకెప్పుడూ ఎవరినీ ద్వేషించమని ఒక్కమాటగా చెప్పారు.

 

ఇది పిల్లలకే కాదు పెద్దలకి కూడా, బస్తాలుబస్తాల టమోటాలు మోసే శక్తి ఎందరికి ఉంటుందంటారు ?కనిపించకుండా మనం మనస్సులో మోస్తున్న కుళ్ళు టమోటాలు బరువెంత?

 

మరింత సమాచారం తెలుసుకోండి: