సాధార‌ణంగా చాలా మందిని వేధిస్తున్న సమస్య నోటి దుర్వాసన. అయితే నోటి దుర్వాసనకు కారణాలు అనేకం. మధుమేహం, చిగుళ్ల సమస్యలు, దంతాల ఇన్ఫెక్షన్, ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం తదితర సమస్యల కారణంగా నోటి నుంచి దుర్వాసన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి వారు మరొకరితో మాట్లాడానికి కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంటారు. మ‌రియు దీని వ‌ల్ల నలుగురిలో ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసంతో మాట్లాడలేని పరిస్థితి రావచ్చు.


అయితే కొన్ని సహజమైన చిట్కాలు, ఆహార అల‌వాట్లు పాటించడం ద్వారా నోరు దుర్వాసన రాకుండా చూసుకోవచ్చు. నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే మంచినీళ్లు ఎక్కువగా తాగుతూ నోరు పొడిగా మారకుండా జాగ్రత్త పడాలంటున్నారు ఆరోగ్యనిపుణులు. అలాగే రోజు దంతాలు, చిగుళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తిన్న వెంటనే నీళ్లతో నోరు పుక్కిలించుకుంటూ ఉంటే నోటి దుర్వాసనకు స్వస్తి చెప్పవచ్చు.


అదే విధంగా పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశ‌నం చేసి నోరు స్మెల్ రాకుండా చేస్తుంది. దాల్చిన చెక్కలోని ఆల్డిహైడ్ కారణంగా నోటి దుర్వాసన పోవడంతోపాటు నోట్లోని బ్యాక్టీరియాను కూడా ఇది తగ్గిస్తుంది. నోరు దుర్వాస‌న‌గా ఉంటే ఒక యాపిల్ పండు తిన్నా చాలు. యాపిల్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ నోట్లో యాసిడ్స్ ను క్రమబద్దం చేస్తాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: