సాధార‌ణంగా చాలా మంది ప‌గ‌టి క‌ల‌లు కంటుంటారు. తాము సాధించాలనుకున్న ఆశలు, ఆశయాల గురించి అస్తమానం ఆలోచించటం వాటి గురించే మనసంతా నింపుకోవడం, అలా మేల్కొని ఉండగానే వాటిని కలగా కనటం పగటికలగా విశ్లేషిస్తున్నారు. అయితే ఎవరైనా తమ స్థాయికి మించి ఏదో సాధిస్తామని చెప్పినప్పుడు పగటి కలలు కంటున్నావా? అంటూ వెక్కిరిస్తాం. అయితే ప‌గ‌టి క‌ల‌లు భ‌విష్య‌త్తు ప‌రంగా.. ఆరోగ్య ప‌రంగా కూడా చాలా ఉప‌యోగ‌క‌రం.


పగటిపూట నిద్ర ఆరోగ్యానికి మంచిది కాదని, లావైపోతారని, పగటికలలు కనకూడదని అవన్నీ ఊహలేనని, సాకారం కావన అంటుంటారు. నిజానికి పగటినిద్ర, పగలు కలలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా సృజనాత్మక శక్తి ఉన్నవాళ్లకే ఇలాంటి కలలొస్తాయి రచయితలు ఊహల్లోనే అద్భుతమైన రచనలు సృష్టిస్తారు. పగటికలల వల్ల ఆరోగ్యంతోపాటు మానసిక ఆనందం కూడా కలుగుతుంది. 


ఎలాఅంటే, మనచేతుల్లో ఇప్పటికిప్పుడు జరగనివాటిని ఊహించుకోవడంద్వారా మానసిక ఆనందం పొందవచ్చు. తద్వారా భవిష్యత్తుపై ఆశలు చిగురిస్తాయి. మ‌నుషుల్లో ఏదైన కష్టం,దుఃఖం ఏర్పడితే, పగ పంతాలతో మనసు గాయపడుతుంటే వెంటనే ఆవిషయం నుంచి మనసు మళ్లించేందుకు గానూ నచ్చిన ఊహల్లో కాస్సేపు గడిపితే శాంతిగా ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: