కావాల్సిన ప‌దార్థాలు:
చికెన్‌- 1 కప్పు
మైదా - 2 కప్పులు
నీళ్ళు - సరిపడా
కారం- 2 స్పూన్లు


గరం మసాల- 1 స్పూను
పసుపు - 1/2 స్పూను
నూనె - వేయించడానికి సరిపడా
అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ - 2 స్పూన్లు


సోంపు పౌడర్‌ - 1స్పూను
ధనియాల పొడి - 2 స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడ


ఉల్లిపాయలు - 3
పచ్చిమిర్చి - 3
గుడ్డు - 1


తయారీ విధానం:
ముందుగా పాన్‌ లో నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేగిన తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో చికెన్‌ మిన్స్‌ను జోడించాలి. తర్వాత అందులోనే సోంపు పౌడర్‌, మిరియాలు, ధనియాలపొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మొత్తం మిశ్రమాన్ని కలపుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. 


ఇప్పుడు ఒక పెద్ద బౌల్‌ తీసుకుని, పిండి, గుడ్డు చిటికెడు ఉప్పు , మైదా వేసి మెత్తగా, మృదువుగా పిండి కలిపి పెట్టుకోవాలి. ఇప్ప‌డు చపాతీల్లా చుట్టుకుని, తర్వాత మధ్యలో చికెన్‌ స్టఫ్‌ను నింపి, అన్ని వైపుల క్లోజ్‌ చేస్తూ సమోసాల్లా ఒత్తుకోవాలి. వీటిని నూనెలో డీ ఫ్రై చేసుకుంటే స‌రిపోతుంది. అంతే చికెన్ స‌మోసా రెడీ..!


మరింత సమాచారం తెలుసుకోండి: