చాక్లెట్ అనగానే నోటిలో ఉన్న లాలాజల గ్రంధులు ఊరుతాయి. వీటి రుచికి ఫిదాకాని వారుండరు. వయస్సుతో పనిలేకుండా చిన్నవారు, పెద్దవారు అనే మాటలేకుండా దీని రుచిని ఆస్వాధిస్తారు. ఇకపోతే నాణ్యత, రుచి ఆధారంగా ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేస్తారు చాలామంది. ఇక మామూలుగా ఓ చాక్లెట్ ధర రూ.1 నుంచి వెయ్యి అంతకంటే కాస్త అటు ఇటుగా ఉంటుందేమో కానీ ఐటీసీ తయారు చేసిన చాక్లెట్ ధర తెలిస్తే షాకవుతారు. ఈ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్‌ను తయారు చేసింది.


అదేమంటే ఈ కంపెనీకి చెందిన ఫాబెల్లె బ్రాండ్... ట్రినిటీ-ట్రఫుల్స్ ఎక్స్‌ట్రార్డినేర్ పేరితో ఓ చాక్లెట్‌ను రూపొందించింది. దీని ధర కిలోకు రూ.4.3 లక్షలు. ఇంతటి ఖరీదైన చాక్లెట్ మరొకటి లేదు. కాబట్టి గిన్నిస్ బుక్‌లో ఈ లిమిటెడ్ ఎడిషన్‌ స్థానం సంపాదించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇకపోతే అరుదైన పదార్థాలు అత్యుత్తమ సింగిల్ ఒరిజినల్ కాకోలను ఉపయోగించి దీన్ని తయారు చేశారు. ఫ్రాన్స్ స్టార్ చెఫ్ ఫిలిప్పే కాంటిసి దీని తయారీకి సాయం చేసినట్టు ఐటీసీ వెల్లడించింది. ఇక ఈ సందర్భంగా మంచి రుచిని అందించే చాకెట్లను అందించడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు.


ఈ చాక్లెట్ కావాలనుకునేవారు ఆర్డర్ చేసుకుంటే చేతితో చెక్కిన ప్రత్యేక చెక్క పెట్టలో డెలివరీ ఇస్తామంటున్నారు. ఒక్కో దాంట్లో సుమారు 15 గ్రాముల చొప్పున 15 చాక్లెట్లు ఉండనున్నాయని, అన్ని పన్నులతో కలిపి ఈ బాక్స్ ధర లక్ష రూపాయలు కాగా.. ఒక్కో చాక్లెట్ రూ.6,670 గా నిర్ణయించారు. .. ఇకపోతే ప్రపంచంలోనే ఉత్తమ చాక్లెట్ ను ఇండియాలో తయారు చేసి అమ్మారనే విషయం ప్రపంచాన్ని ఆకర్షించాలనే ఉద్దేవంతోనే ఈ చాక్లెట్‌ను తయారు చేశాం అని ఐటీసీ లిమిటెడ్, ఫుడ్ డివిజన్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి అనూజ్ రుస్తాగీ తెలిపారు. ..


మరింత సమాచారం తెలుసుకోండి: