ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న మాట కర్తార్‌పూర్. పాకిస్థాన్‌తో భారత్‌కు సఖ్యత లేని సమయంలో... పాకిస్థాన్‌లోని  కర్తార్‌పూర్‌ వెళ్లేందుకు మాత్రం రెండు దేశాల మధ్య ఒప్పందం జరగడం చాల ఆనందం. ఇండియాలోని పంజాబ్‌లో ఉన్న డేరా బాబా నానక్‌ గురుద్వారా నుంచి పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో ఉన్న కర్తార్‌పూర్‌లో ఉండే గురుద్వారా వరకు కారిడార్‌ను అతి త్వరలో నిర్మించబోతున్నారు . ఈ విషయానికి సంబంధించి భారత్‌, పాకిస్థాన్‌ మధ్య కీలకమైన ఒప్పందం కూడా జరగడం పూర్తి అయంది. 


ఇక రెండు దేశాల ప్రతినిధులూ ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడా చేయడం కూడా పూర్తి అయంది. ఐతే... ఈ విషయాలు అయి కూడా సైలెంట్‌గా జరిగిపోయాయి. ఇండియాలో మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలో... భారత్‌, పాకిస్థాన్‌ జీరోలైన్‌ దగ్గర ఒప్పందంపై సంతకాలు పెట్టే కార్యక్రమం కూడా అయ్యిపోయింది. భారత్‌లోని పంజాబ్‌లో ఉన్న డేరా బాబా నానక్‌ గురు ద్వారా నుంచి పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో ఉన్న కర్తార్‌పూర్‌లో ఉన్న గురుద్వారా వరకు ఈ కారిడార్‌ను నిర్మించడం ప్రారంభిస్తున్నారు. 


ఇక అంతర్జాతీయ సరిహద్దుకు 4 కిలోమీటర్ల అవతల ఆ గురుద్వారా ఉంది. ఇండియా నుంచీ వెళ్లేవారికి వీసాతో పనిలేకుండా గురుద్వారాకు అనుమతిని ఇవ్వడం జరిగింది. ఐతే కర్తార్‌పూర్‌ సాహిబ్‌ నుంచి మొదటగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యాత్ర విషయంలో పాకిస్థాన్‌ రూ.1400 ($20) సర్వీస్ ఛార్జి తీసుకుంటోంది. ఇంకా సిక్కుల ఆది గురువు శ్రీ గురునానక్ దేవ్ పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్‌లో 18 ఏళ్లు గడపడం జరిగింది.


రావి నదీ తీరాన ఈ గురద్వార కర్తార్‌పూర్ ఉంది. విదేశాల్లో ఉండే ఎన్నారైలు కూడా గురుద్వార దర్బార్ సాహిబ్‌ను దర్శించుకోవచ్చని హోంశాఖ తెలియచేసింది. రోజుకు 5000 మంది భక్తులు కర్తార్‌పూర్ సాహిబ్‌ను దర్శిస్తారని అంచనా కేసుల వేస్తున్నారు. ఇక కర్తార్‌పూర్ సాహిబ్‌ను వెళ్లాలనే  వారు ముందుగా ఆన్‌లైన్‌లో పేరు, వివరాలు రిజిస్టర్ చేయించుకోవాలి.  రిజిస్టర్ కోసం https://prakashpurb550.mha.gov.in/kpr సైట్‌లోకి  వివరాలు తెలపాలి.  యాత్రకు వెళ్లే 4 రోజుల ముందే బుక్ చేసుకుంటే యాత్ర బాగా  సాఫీగా కొనసాగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: