సాధార‌ణంగా పండ్లను తిని గింజలు విసిరేయడం ఎవరైనా చేసే పనే. ఇక మండుటెండలో పుచపండును తింటే దప్పిక తీర్చడ‌మే గాక‌.. నీటి శాతం, వేడిని తగ్గించే గుణాలు ఇందులో అధికంగా ఉంటాయి. అయితే పుచ్చపండు తినేసి గింజలు ఊసేస్తాం. కానీ అది చాలా పొర‌పాటు. ఎందుకంటే పుచ్చకాయ గింజలు అంత రుచిగా ఉండకపోయినా గుండె ఆరోగ్యాన్ని మాత్రం అందిస్తాయి. పుచ్చపండు గింజల్లో విటమిన్స్‌తో పాటు మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, పాస్పరస్, కాపర్, జింక్, మాంగనీస్ సమృద్ధిగా ఉంటాయి. 


ఈ గింజల్లో ఉండే ఆమైనో ఆసిడ్స్ రక్తనాళాలను వెడల్పు చేసి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తాయి. పుచ్చగింజల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటుంది. ఓ కప్పు ఎండిన గింజల్లో 30.6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. అంతే కాకుండా.. పుచ్చకాయలో ఉండే లైకోపీస్ అనే పదార్థం పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతుంది.


రోగనిరోధక శక్తిని ఉత్తేజితం చేయంలో పుచ్చ గింజ‌లు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రిస్తాయి. పుచ్చ గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి తర్వాత ఆరబెట్టుకోవాలి. ఆ తరువాత వీటిపైనున్న పొట్టును తీసి తింటే చాలా మంచిది. ఈ గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: