అమెరికాలో గిటార్ హోటల్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. గిటార్ ఆకారంలో నిర్మించిన అతిపెద్ద హోటల్ ఫ్లోరిడాలో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకునే విధంగా.. హోటల్ ఇంటీరియల్ డిజైన్ కూడా గిటార్లను పోలి ఉండేలా జాగ్రత్తపడ్డారు నిర్వాహకులు. 


హాలివుడ్‌లో అత్యంత ఖరీదైన, కళ్లు చెదిరే గిటార్‌ హోటల్‌ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అచ్చం గిటార్‌ ఆకారంలో నిర్మించిన ఈ హోటల్లో ఏడు వేల సీట్లు కలిగిన కాసినో ఫ్లోర్, 1200 హోటల్‌ గదులు ఉన్నాయి. ఇవి కాకుండా పలు గేమింగ్‌ టేబుళ్లు, సంగీత విభావరి వేదికలు ఉన్నాయి. హోటల్ నిర్మాణానికి అయిన ఖర్చు ఒకటిన్నర బిలియన్ డాలర్లు. 


సెమిలోన్ హార్ట్ రాక్ క్యాసినో విస్తరణలో భాగంగా.. ఈ గిటార్ హోటల్ రూపుదిద్దుకుంది. హోటల్ లో బయటకు కనిపించే భాగాన్ని ఆక్వా గ్లాస్ తో తీర్చిదిద్దారు. దీంతో పగటి సమయాల్లో ఫ్లోరిడా సన్ లైట్ ను ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఒకసారి భవనంలో ప్రవేశించాక మనం గిటార్ ఆకారంలో ఉన్న హోటల్లో ఉన్నామనే ఫీల్ ఏమాత్రం కలగకుండా నిర్వాహకులు జాగ్రత్త తీసుకున్నారు. హోటల్ లో డోర్స్ హ్యాండిల్స్ కూడా ఎలక్ట్రికల్ గిటార్ షేపులో రూపొందించారు. 


గిటార్ హోటల్ కు మరో ప్రత్యేకత కూడా అంతస్తుంది. హోటల్ కింది అంతస్తులో పాప్ లెజెండ్ లు వాడిన అరుదైన, అపురూపమైన వస్తువుల కలెక్షన్ కూడా ఉంది. ఎల్విస్ ప్రిస్లీ, మడోన్నా, రిహాన్నా, జిమ్మీ పేజ్ లాంటి లెజెండ్లు ఉపయోగించిన ఇన్ స్ట్రుమెంట్స్ అతిథుల్ని చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. 450 అడుగుల ఎత్తైన ఈ గిటార్ హోటల్ లో.. 34 అంతస్తులున్నాయి. హోటల్ అంటే కేవలం ఆతిథ్యం మాత్రమే కాదు.. వినోదం, ఆహ్లదం కలిగించే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. గిటార్ హోటల్ లో 19 రెస్టారెంట్లు, 20 బార్లు, షాపులు, నైట్ క్లబ్బులు, స్పా కూడా ఉండటంతో.. సందర్శకులు ఈ హోటల్ కు క్యూ కడుతున్నారు. సాధారణంగా హోటళ్లలో రూమ్ రెంట్ చెల్లిస్తే సరిపోతుంది. కానీ గిటార్ హోటల్ కు మాత్రం ప్రత్యేకంగా రోజూ రిసార్ట్ ఫీజు కూడా కట్టాల్సి ఉంటుంది. గిటార్ హోటల్ ప్రారంభోత్సవానికి జానీ డెప్ లాంటి హాలీవుడ్ స్టార్లు హాజరయ్యారు. 
గిటార్ హోటల్ చుట్టూ స్విమ్మింగ్ పూల్ మరో అట్రాక్షన్. హోటల్ నుంచి బయటకు రావడానికి ఎవరైనా కన్ఫ్యూజ్ అయితే.. సిబ్బంది దగ్గరుండి దారి చూపిస్తారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: