కావాల్సిన పదార్థాలు:
చికెన్‌- అర కిలో
కాజు- అర కప్పు
ఉల్లిపాయలు- 2
కరివేపాకు- ఒక రెమ్మ
అల్లం వెల్లుల్లి పేస్ట్‌- 2 స్పూన్లు


పచ్చిమిర్చి- 4
ఉప్పు- త‌గినంత‌
పసుపు- అర స్పూన్‌
కొత్తిమీర- ఒక కప్పు
నూనె- కొద్దిగా


కారం- తగినంత
ధనియాలు- ఒక స్పూన్‌
గసగసాలు- 2 స్పూన్లు
పాలు- 2 స్పూన్లు


మసాలాకు- 2
లవంగాలు- 5
జీలకర్ర- ఒక స్పూన్‌


తయారీ విధానం:
ముందుగా చికెన్‌లో కొంచెం కారం, పసుపు, ఉప్పు, ఒక స్పూన్‌ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి బాగా కలిపి ఒక అరగంట ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇప్పుడు మసాలా దినుసులు, జీడిపప్పులు పొడి చేసుకోవాలి. మిగిలిన కాజు వేయించి తీసుకోవాలి. అదే నూనెలో తరిగిన కొత్తిమీర, మిర్చి, తగినంత కారం వేసి దోరగా వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి.


ఆ తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి మసాలా పొడి, పసుపు కూడా వేసి బాగా కలిపి రెండు నిమిషాలు వేయించాలి. నానబెట్టుకున్న చికెన్‌ వేసి బాగా కలిపి స్లో ఫ్లేమ్‌పై ఐడు నిమిషాలు ఉడికించి, తగినంత ఉప్పు, ఒక కప్పు నీరు కలిపి మూత పెట్టి ఉడికించాలి.  మెత్తగా ఉడికిన తర్వాత కాజు పొడి, వేయించిన కాజు కలిపి కూర బాగా దగ్గరయ్యే వరకు ఉడికించి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే కాజు చికెన్ కుర్మా రెడీ..!


మరింత సమాచారం తెలుసుకోండి: