కావాల్సిన ప‌దార్థాలు:
సొర‌కాయ‌లు- అర‌కిలో
ఉల్లిపాయ- రెండు
టొమాటో- ఒకటి
ప‌చ్చిమిర్చి- ఐదు


జీలకర్ర- అరటీస్పూన్
అల్లంవెల్లుల్లి పేస్ట్‌- ఒక‌  టీస్పూన్ 
ధనియాల పొడి- టీస్పూన్‌
గ‌రంమసాలా- అరటీస్పూన్


ఉప్పు- రుచికి సరిపడా
కారం- ఒక టీస్పూన్ 
ప‌సుపు- చిటికెడు
కొబ్బరి తురుము- 3 స్పూన్లు


గసగసాలు- టీస్పూను
జీడిపప్పు- కొద్దిగా
నూనె- 2 టీస్పూన్లు
కొత్తిమీర- కొద్దిగా


తయారీ విధానం: 
ముందుగా సొరకాయల‌ను తీసుకొని శుభ్రం చేయాలి. త‌ర్వాత‌ తొక్కతీసి ముక్కలు కోసి ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు, కొబ్బరి, గసగసాలు మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. త‌ర్వాత స్టౌ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి, వేడ‌య్యాక‌ జీలకర్ర వేసి వేగాక ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. తరవాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి ఓ నిమిషం వేగనివ్వాలి. 


ఇప్పుడు టొమాటో ముక్క లు కూడా వేసి అవి కాస్త మగ్గిన తరువాత సొరకాయ ముక్కలు  పసుపు, కారం, ఉప్పు, ధనియాలపొడి, గరం మసాలా వేసి కలపాలి. తర్వాత‌ ఓ కప్పు నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి.  ఇప్పుడు ముందుగా రుబ్బి పెట్టుకున్న‌ కొబ్బరి ముద్ద వేసి బాగా కలిపి సిమ్‌లో ఉడికించాలి. చివరగా కొత్తిమీర తురుము వేసి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ టేస్టీ సొరకాయ కుర్మా రెడీ..!


మరింత సమాచారం తెలుసుకోండి: