ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరగాలి అనేది ఎప్పటినుండో మన పెద్దవారు చెప్తున్న మాట. వాస్తవానికి పెద్ద వాళ్ళ మాటలను మనలోని చాలా మంది పెడ చెవిన పెట్టినప్పటికీ, అందులో ఎంతో నిగూడార్థం దాగి ఉందని నేటి కాలంలోని కొన్ని లేటెస్ట్ పరిశోధనలు నిరూపిస్తున్నాయి. వాస్తవానికి ఒకప్పటి పెద్దవారు, మనిషి పుట్టుక నుండి మరణం వరకు ఏ దశలో ఎటువంటి క్రియలు చేయాలి అనేటువంటివి అందుకే కల్పించారు. అయితే ప్రస్తుతం సమాజంలో ప్రధాన సమస్యల్లో బ్యాచిలర్స్ వివాహం కూడా ఒకటి అనే చెప్పాలి. గతంతో పోలిస్తే అమ్మాయిల శాతం తగ్గడం తోపాటు అబ్బాయిలు కూడా తమ జీవితంలో మంచి ఉద్యోగం సంపాదించి, ఒకింత స్థిరపడిన తరువాతనే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఇదే వారి జీవితానికి కొంత ముప్పుగా పరిణమిస్తుందని అంటున్నారు చైనాలోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు. 

ఇక ఇటీవల కొంత శాంపిల్ గా కొందరు పెళ్లి అయిన మరియు పెళ్లి కానీ అబ్బాయిల మీద వారు జరిపిన పరిశోధనలను బట్టి ఎక్కువ వయసు వచ్చి ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉన్న బ్యాచిలర్స్ తో పోలిస్తే పెళ్లి చేసుకుని కుటుంబ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి గుండె మరియు ఆరోగ్యం కొంత పదిలమని తేల్చారట. అయితే దానికి వారు కొన్ని కారణాలను కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా కౌమార దశ ముగిసిన చాలా ఏళ్ళ తరువాత పెళ్లి చేసుకుంటే పిల్లలు కలిగే అవకాశం కొంత తక్కువట. అన్నిటికంటే ముఖ్యంగా తమలోని శృంగార వాంఛలను మనసులోనే దాచుకుని ఒంటరిగా జీవనం సాగించడం, 

అలానే మరికొందరిలో పెళ్లి కావడం లేదనే ఫీలింగ్స్ వంటివి అణచుకోవడం వంటివి బ్యాచిలర్స్ గా ఉండే వారి గుండె మరియు మెదడు పై కొంత ఒత్తిడి ప్రభావాన్ని చూపుతాయని, అయితే అటువంటివి సమస్యలు పెళ్లి చేసుకున్న వ్యక్తిలో ఉండవని అంటున్నారు. ముఖ్యంగా పెళ్లి అనేది ఖచ్చిత వయసులో చేసుకుని హ్యాపీగా ఫామిలీ లైఫ్ లీడ్ చేస్తుంటే ఆరోగ్య పరంగా మానసిక ఒత్తిడి వంటి పలు సమస్యలు రావని, దానివల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా దరిచేరే అవకాశం కూడా తక్కువ అని అంటున్నారు. సో, విన్నారుగా బ్యాచిలర్స్, మరి వీలైనంత త్వరగా మీ లైఫ్ లో స్థిరపడి పెళ్లి చేసుకోండి మరి.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: