ప్రేమ పిచ్చిదంటారు. ఎందుకంటే ప్రేమలో పడిన వారికి లోకమంతా వింతగా కనిపిస్తుంది. అప్పటివరకు తాను చూసిన ప్రపంచం తన ప్రేమముందు చిన్నదిగా కనిపిస్తుంది. ఇప్పుడే తానో కొత్త లోకాన్ని కనుగొన్నట్లుగా ఫీలవ్వుతాడు. ఇక ప్రేమించన వారి చుట్టూ ఈగలా, దోమలా తిరగడం మొదలు పెడుతారు. ఎప్పుడైతే ప్రేమలో పడతారో అప్పటి నుండి జేబులో ఉన్న డబ్బులకు రెక్కలు వస్తాయి. నోరు అబద్దాలు నేర్చుకుంటుంది. తానే ఊహించలేనంతగా మార్పు ప్రేమికుల్లో కనిపిస్తుంది.


ప్రేమించిన వారికోసం రకరకాలైన గిఫ్ట్స్ ఇవ్వడం మొదలు పెడతారు. డబ్బున్న ప్రేమికులైతే భారీ భారీ గిఫ్ట్స్ ఇస్తుంటారు. కాని మధ్యతరగతి వారిలో ప్రేమ ఉంటుంది కాని ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చుకునే స్దోమత ఉండదు. ఏదో వారికి తోచిన బహుమతి ఇస్తుంటారు. అయితే తానిచ్చే గిఫ్ట్ తన ప్రియురాలికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండేట్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. కొందరు ఆర్నమెంట్స్ ఇస్తే.. మరి కొందరు ఇష్టమైన డ్రెస్సులు కొనిస్తుంటారు. ఇక మరికొందరైతే ప్రియురాలికి నచ్చేలా రింగ్‌లు ఇస్తూ ఉంటారు. అయితే జపాన్‌కు చెందిన ఓ యువకుడు.. తన ప్రియురాలిని ఇంప్రెస్ చేయడానికి తానే ఓ రింగ్ తయారు చేసి ఇచ్చాడు.


అయితే అందులో గొప్పేముందని ఆలోచిస్తే పప్పులో కాలేసినట్లే. ఇంతకు ఆ ప్రేమికుడు ఏం చేశాడో తెలిస్తే.. కడుపుబ్బా నవ్వుకుంటూ..ఇవేం ఐడియా బాబు అని తల బాదుకుంటారు. ఎందుకంటే అది మామూలు రింగ్ కాదు. అతడి చేతి గోళ్లతో అతడే స్వహస్తాలతో ఏడాది పాటు కష్టపడి తయారు చేసిన ఉంగరం. ఎలా చేసాడంటే పెరిగిన గోళ్లను కట్ చేసి ఓచోట జమచేసి, ఆ తర్వాత ఆ గోళ్లను అన్నీ మిక్సీలో వేసి పొడి చేశాడు. అనంతరం ఆ పొడిని నీళ్లలో మిక్స్ చేయగా  వచ్చిన మిశ్రమాన్ని ఓవెన్‌లో పెట్టి వేడిచేశాడు.


ఆ తరువాత దాన్ని చిన్న పప్పు దినుసు సైజ్ వచ్చేలా చేశాడు. ఆ తర్వాత అప్పటికే రెడీ చేసిపెట్టుకున్న సిల్వర్ రింగ్‌లో ఆ పప్పు దినుసులా తయారు చేసిన గోళ్ల మిశ్రమాన్ని ఓ వజ్రంలా అమర్చాడు. అయితే ఈ తతంగాన్ని ఎలా చేశాడో మొత్తం.. వీడియో తీసి షేర్ చేశాడు. దీంతో ఇది విపరీతంగా వైరల్ అవుతోంది. గోళ్లతో రింగ్ ఏంటో అంటూ.. పిచ్చి ముదిరితే ఇలానే ఉంటుందంటూ రకరకాల కామెంట్లకు సోషల్ మీడియా వేదికైంది...


మరింత సమాచారం తెలుసుకోండి: