కావాల్సిన ప‌దార్థాలు:
వంకాయలు- అరకిలో
ఎండుమిర్చి- 8
జీలకర్ర- టీస్పూను


వెన్న- 100గ్రా
ఉప్పు- సరిపడా
దనియాలు- మూడు టీస్పూన్లు


నూనె- రెండు టేబుల్‌స్పూన్లు
సెనగపప్పు- రెండు టేబుల్‌స్పూన్లు
మినప్పప్పు- రెండు టేబుల్‌స్పూన్లు


త‌యారీ విధానం:
ముందుగా స్టౌ మీద‌ పాన్‌లో ఎండుమిర్చి, దనియాలు, జీలకర్ర, మినప్పప్పు, సెనగపప్పు విడివిడిగా వేయించాలి. తరవాత వీటన్నింటినీ మిక్సీ జార్‌లో వేసి మరీ మెత్తగా కాకుండా గరుకుగా ఉండేలా పొడి చేయాలి. ఈ పొడిలో ఉప్పు కలపాలి. తరవాత వెన్న కలిపి ముద్దలా చేయాలి. ఆ త‌ర్వాత వంకాయలు కడిగి తడి లేకుండా తుడవాలి. ఒక్కో కాయనీ గుత్తి వంకాయ కూర కోసం కోసినట్లుగానే కోసి, అందులో వెన్న కలిపిన పొడిని పెట్టాలి. 


ఇప్పుడు లోపలి స్టఫ్‌ బయటకు రాకుండా కాయలను చూసుకోవాలి. వెడల్పాటి బాణలిలో టేబుల్‌స్పూను నూనె వేసి స్టఫ్‌డ్‌ వంకాయలన్నీ ఒకదానిపక్కన ఒక్కటి ఉండేలా ఉంచి 5-10 నిమిషాలు వేయించాలి. తరవాత జాగ్రత్తగా రెండోవైపు తిప్పి మరో టేబుల్‌స్పూను నూనె వేసి అలాగే వేయించి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే స్టఫ్‌డ్‌ వంకాయ రెడీ..!



మరింత సమాచారం తెలుసుకోండి: