వైద్య సౌకర్యాలు పెరిగే కొద్దీ మనిషి సగటు జీవన ప్రమాణం పెరుగుతోంది. ఆయుష్షూ పెరుగుతోంది. అందుకే జననాల సంఖ్య పెరుగుతుంటే మరణాల సంఖ్య తగ్గుతోంది. తాజాగా వెల్లడైన గణాంకాలు ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తున్నాయి.


కేంద్రప్రభుత్వం లెక్కల ప్రకారం చూస్తే.. 2017లో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 2,03,638 మంది జన్మించారు. అదే సమయంలో 71,701 మంది మరణించారు.అంటే.. ఒక్క గంటలో 23 మంది పుడుతుంటే.. 8 మంది మరణిస్తున్నారన్నమాట.


2017 ఏడాది జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఎంత మంది జన్మించారు, ఎందరు మరణించారనే అంశంపై లెక్కలు తీసినప్పుడు ఈ వివరాలు వెలుగు చూశాయి. తెలంగాణలో అత్యధిక మరణాలు, జననాలు హైదరాబాద్ రెవెన్యూ జిల్లా పరిధిలోనే నమోదయ్యాయి.


మేడ్చల్ జిల్లాలో జన్మించిన వారి కంటే చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. రెండు జిల్లాలతో పోలిస్తే జననాలు, మరణాల్లోనూ ఇది చివరి స్థానంలో ఉంది. హైదరాబాద్ జిల్లాలో 1,88,457 మంది పుడితే 60,730 మంది మరణించారు.


రంగారెడ్డి జిల్లాలో 12,391 మంది జన్మిస్తే 6,114 మంది కన్నుమూశారు. మేడ్చల్ జిల్లాలో 2,790 పుడితే, 4857 మంది మృతిచెందారు. మూడు జిల్లాల పరిధిలో 1,05,930 మంది పురుషులు జన్మిస్తే 97,708 మంది మహిళలు పుట్టారు. దేశంలోని చాలా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో స్తీ పురుష నిష్పత్తి మెరుగైన స్థాయిలోనే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: