సోషల్ మీడియా ఎంత పాపౌలర్ అయిందో మనకు తెలిసిన విషయమే.. అంతకు మించిన రీతిలో ఎమోజిలు కూడా పాపులర్ అయ్యాయి. అదేంటంటే మనం సంతోషంగా ఉన్న, బాధలో ఉన్న అవతలి వారికి తెలియాలంటే ఎమోజిలతో చూపిస్తారు. అది ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. అందుకే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయినా కొన్ని ఎమోజిలను తొలగిస్తున్నామని సోషల్ మీడియా వెల్లడించింది. 


వివరాల్లోకి వెళితే.. ఈ ఎమోజిలు చూడటానికి లైంగిక వాంఛను తెలిపే లేదా సూచించే ఎమోజీలపై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ నిషేధం విధించింది. వంకాయ, పిక్క ఉండే పీచ్‌ పండు, కింద పడుతున్న నీటి బిందువుల ఎమోజీలు సహా లైంగిక కోరికలను తెలియజేసే ఇతర ఏ ఎమోజీని వాడరాదంటూ యూజర్లకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆ నేపథ్యంలో ఈ ఎమోజిలు నిషేదించాలని చాలా మంది డిమాండ్ చేయడంతో వీటిని కనిపించకుండా చేస్తుంది. 


ఈ ఎమోజిలతో పాటుగా అర్ద నగ్నంగా కనిపించే ఏ ఎమోజిలు ఇకమీద కనపడని ఆయా యాజమాన్యాలు వెల్లడిస్తున్నాయి. ఈ రెండు సామాజిక వేదికలను వేశ్యలు తమ లైంగిక వ్యాపారం కోసం వాడుకోకుండా నివారించేందుకే ఈ నిషేధం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో చాలా మంది ప్రముఖులు పెద్దవారు చూస్తుండటంతో ఈ ఎమోజిలను నిషేదిస్తున్నారు. 


మరో ట్విస్ట్ ఏంటంటే.. లైంగిక వాంఛలను తెలియజేసే ఇలాంటి ఎమోజీల వల్ల ముఖ్యంగా తన లాంటి పెళ్లయిన మగవాళ్లు అంతులేని బాధను అనుభవించాల్సి వస్తోందని ఇటీవల సోషల్‌ మీడియాలో వాపోయిన 42 ఏళ్ల ర్యాప్‌ సింగర్‌ కన్యే వెస్ట్‌కు ఇది శుభవార్త కావచ్చని ఒకరు వెల్లడించగా, ఆయన భార్య కిమ్‌ కర్దాషియిని ‘ఎక్స్‌పోజింగ్‌’ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తుంటే బాధ పడని వ్యక్తి, వీటికి ఎందుకు బాధ పడుతున్నారో అర్థం కావడం లేదని మరొకరు వ్యాఖ్యానించారు. అదొకటి ఇదొకటా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: