కావాల్సిన ప‌దార్థాలు:
బియ్యం- పావుకిలో
పచ్చికొబ్బరి తురుము- అరకప్పు
ఉసిరి తురుము- అరకప్పు
మినప్పప్పు- అరటీస్పూను


జీలకర్ర- అరటీస్పూను
పసుపు- చిటికెడు
నూనె- 2 టేబుల్‌స్పూన్లు
పచ్చిసెనగపప్పు- అరటీస్పూను


కొత్తిమీర తురుము- 2 టీస్పూన్లు
కరివేపాకు- 4 రెబ్బలు
ఉప్పు- తగినంత 
ఎండుమిర్చి- నాలుగు
పచ్చిమిర్చి- నాలుగు


పల్లీలు- టీస్పూను
ఆవాలు- అరటీస్పూను
జీడిపప్పు- పది


తయారీ విధానం:  
ముందుగా అన్నం పొడిపొడిలాడేలా వండుకొని ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి.. నూనె వేసి కాగాక ఎండుమిర్చి, మినప్పప్పు, పచ్చిసెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, జీడిపప్పు, పసుపు, సన్నగా చీలిన పచ్చిమిర్చి, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి వేగనివ్వాలి. ఆ తరవాత ఉసిరికాయ తురుము, పచ్చికొబ్బరి తురుము వేసి వేయించాలి.  


ఇప్పుడు వెడల్పాటి పళ్లెంలో అన్నం వేసి అందులో వేయించిన మిశ్రమం, కొత్తిమీర తురుము వేసి బాగా కలిపితే స‌రిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ ఉసిరి-కొబ్బరి రైస్‌ రెడీ. ఉసిరి మ‌రియు కొబ్బ‌రి ఈ రెండిటి కాంబినేష‌న్ రుచికి.. ఆరోగ్యానికి చాలా మంచిది. సో.. ఈ రెసిపీని ఖ‌చ్చితంగా ట్రై చేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి: