ఆరోగ్యంగా ఉండాలంటే జీర్ణక్రియలో ఎలాంటి సమస్యలు ఉండకూడదు. ఒకవేళ జీర్ణక్రియలో ఎవైన సమస్యలు ఉన్నట్లయితే, దీనిని ఒక ప్రమాదకరమైన వ్యాధిగా పరిగనించవద్దు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, జీవన విధానం కారణంగా జీర్ణక్రియ సమస్య తలెత్తుతోంది. అన్నం అరగకపోవడం, అజీర్తి చేయడం, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయి. ఇంటి వద్దే సులభమైన ఆయుర్వేద పద్ధతుల ద్వారా జీర్ణక్రియ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


- మధ్యాహ్న భోజనాన్ని పుష్టిగా చేయండి. కానీ రాత్రి భోజనం మాత్రం మితంగా తీసుకోండి. రాత్రి 8 గంటల లోపలే డిన్నర్ చేయడం చాలా మంచిది.


-  భోజనం చేయడానికి ముందు తాజాగా ఉన్న చిన్న అల్లం ముక్క, కొంచెం నిమ్మరసం తీసుకోండి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎలాంటి జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.


- కొన్ని పుదీనా ఆకులను తీసుకుని నమిలినా, వాటిని మరిగించి తయారు చేసిన ద్రవాన్ని తాగినా జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. అలాగే పుదీనా కడుపునొప్పి కూడా తగ్గిస్తుంది.


- జీర్ణక్రియ సమస్యలని రాకుండా చూసుకోటానికి నీటిని మించిన మంచి ఔషదం లేదు. రోజులో వీలైనంత నీరు త్రాగటానికి ప్రత్నించండి. 


- కరివేపాకుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. రెండు లేదా మూడు కరివేపాలను బాగా నమిలితే జీర్ణ ప్రక్రియ మెరుగు పడుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: