ఈ కాలంలో లో మందు వాసన చూడని యువకులు చాలా అరుదు. మేజర్ అయిన యువకులే కాకుండా 18 సంవత్సరాలు నిండని పిల్లలు కూడా మద్యానికి బానిసలు అవుతున్నారు. మద్యం బాటిల్ పై మద్యం సేవించడం హానికరమని రాసినప్పటికీ అది పట్టించుకునే పరిస్థితుల్లో మన సమాజంలోని యువకులు లేరు. సినిమాల్లో కూడా సినిమాకి ముందు మద్యపానం హానికరం అంటూ ఎంతోమంది ముఖేష్ లాంటి వాళ్లను చూపించినా మన వాళ్లు మాత్రం మారరు.

తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలు ఇప్పటివరకు మందు వాసన కూడా చూడలేదని అనుకుంటూ భ్రమలో బ్రతికేస్తున్నారు కాకపోతే యువకులంతా మద్యం మత్తులో మునిగి తేలుతున్నారని తెలియదు పాపం. మన రాష్ట్రంలో మద్యపాన నిషేధం అంటూ ఎన్ని కార్యచరణలు చేసిన మద్యం బాటిల్ రేట్లు పెంచిన మందు బాబులు మాత్రం మద్యం తాగడం ఆపట్లేదు.  మద్యం తాగితే నష్టాలు ఎన్నో ఉన్నాయి. అందులోనూ మగవారు మద్యం సేవించడం వల్ల వారి మగతనం పై కూడా ప్రభావం చూపుతుందని తాజా పరిశోధనలో బయటపడింది.

చాలామంది మద్యం తాగితే మత్తుతో మూడ్ ఎక్కువవుతుందని సెక్స్ లో బాగా పాల్గొనవచ్చనే అపోహలో ఉన్నారు. నిజానికి మద్యం ఎక్కువ తీసుకోవడం వల్ల మగవారిలో వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుందట. అలాగే వాటి సైజ్, షేప్లలో కూడా వ్యత్యాసం వస్తుంది. ఇది ఒక్క వారిలో మాత్రమే అనుకుంటే పొరపాటు. ఆడవారిలో కూడా మద్యం ఎక్కువ సేవించడం వలన సెక్స్ కోరికలు తగ్గిపోతాయట. ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే మనలో ఉండే టెస్టోస్టిరాన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. అందుకే మన దేశంలో వివాహితులైన మగవారిలో పిల్లలు కనే విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మన సమాజంలో సిగ్గు, బిడియం వల్ల డాక్టర్లతో ఇలాంటి విషయాలను చర్చించడం చాలా తక్కువ.

కాబట్టి రానున్న రోజుల్లో ఈ సమస్య పెరిగిపోయి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికైనా మద్యం ఎక్కువగా తీసుకునేవారు అ మోతాదు తగ్గిస్తే మంచిది లేదంటే తీవ్ర దుష్ఫలితాలను ఎదుర్కోవలసి వస్తుంది. పూర్తిగా తాగుడు బంద్ చేస్తే మరీ మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: