టెక్నాల‌జీ పుణ్య‌మా అని ప్రజలకు అతి తక్కువ ధరకు అందుబాటులోకి వస్తున్న ఇంటర్నెట్ డాటా.. స్మార్ట్‌ఫోన్లు అనేక సౌల‌భ్యాలు తేవ‌డంతో పాటుగా...ఎన్నో విప‌రిణామాల‌కు సైతం దారితీస్తోంది. సుల‌భంగా అందుబాటులోకి రావ‌డం వ‌ల్ల‌ ఇంటర్నెట్‌లో బూతు చిత్రాలను చూసేవారి సంఖ్యను పెంచుతున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆధునిక జీవనగతిని మార్చిన స్మార్ట్‌ఫోన్, త‌క్కువ ధ‌ర‌లో అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్ డాటాతో రెగ్యులర్‌గా నీలి చిత్రాలు చేసేవారి సంఖ్య పెరుగుతున్నదని సర్వేలు పేర్కొంటున్నాయి. గడిచిన మూడేళ్ల‌లో ఇంటర్నెట్ సహకారంతో పోర్న్ చూస్తున్నవారి సంఖ్య 75 శాతం పెరిగినట్టు వెల్లడైంది. 


ఇంట‌ర్నెట్ త‌ప్పుడు వినియోగాలతో ఒక తీవ్ర సామాజిక సమస్యకు కూడా కారణమవుతోంది. అదే పోర్నోగ్రఫీ! ప్రత్యేకించి గడిచిన రెండేండ్లలో శృంగారపరమైన ఆరోగ్యం, పునరుత్పత్తి శక్తిపై పోర్న్ వీక్షణ తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు తేలింది. ఆన్‌లైన్‌లో పోర్న్ చిత్రాలు చూసేవారి సంఖ్యతోపాటే.. వారిలో లైంగిక ఆరోగ్యం, పునరుత్పత్తి సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయన్న సంకేతాలు వెలువడ్డాయి. కొద్దికాలం కింద‌ట వెలువ‌డిన ఓ స‌ర్వేలో....మొత్తం ఐదువేల మందిని సర్వే చేయగా.. పోర్న్ చిత్రాలు చూస్తున్నామని 78% పురుషులు, 11% మహిళలు పేర్కొన్నారు. శృంగారంలో అసంతృప్తి కారణంగా పోర్న్‌వైపు మొగ్గుచూపుతున్నవారు పురుషుల్లో 52%, మహిళల్లో 60% ఉన్నట్టు వెల్లడైంది. ఇక శృంగారం పట్ల అయిష్టత, చురుకైన భాగస్వామ్యం లేకపోవడం కారణంగా నీలి చిత్రాలు చూసేవారు పురుషుల్లో 84%, మహిళల్లో 38% ఉన్నట్టు సర్వే  వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.


ఈ గ‌ణాంకాల యొక్క  ఫ‌లితాల గురించి నిపుణులు సంచ‌ల‌న అంశాలు వెల్ల‌డిస్తున్నారు. నీలిచిత్రాల వీక్ష‌ణం ఇక్కడే కట్టడి చేయకపోతే తీవ్ర సామాజిక సమస్యగా మారే అవకాశం ఉందని  హెచ్చరిస్తున్నారు. పోర్న్ చూస్తున్నవారు.. అందులో చూపిస్తున్నదానికి, వాస్తవ శృంగారానికి మధ్యన తేడా గమనించలేక సైకలాజికల్‌గా తీవ్రంగా ప్రభావితమవుతున్నట్టు తెలిపింది.ఇంటర్‌నెట్‌లో పోర్న్‌ను చూస్తే.. సమాజంలో దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. పోర్న్ చూస్తూ ఊహాలోకంలో విహరించడం వల్ల పురుషులు, మహిళల్లో శృంగారంపై అనాసక్తి నెలకొంటుందని వెల్ల‌డిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: