కావాల్సిన పదార్థాలు: 
కాలిఫ్లవర్‌ ఆకులు - ఒకటి
కొత్తిమీర - నాలుగు రెమ్మలు
బ్రొకోలి - కొద్దిగా
బచ్చలి ఆకులు - ఆరు


క్యారెట్‌- ఒకటి
కీరా- ఒకటి
మెంతికూర ఆకులు- పావు కప్పు
క్యాబేజి ఆకులు - రెండు


తయారీ విధానం: 
ముందుగా అన్నిట్నీ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్ప‌డు కుక్కర్‌లో ఒక విజిల్‌ వచ్చేవరకూ ఉడికించి దించేయాలి. చల్లారాక మిక్సీలో జ్యూస్‌ చేసుకోవాలి. ఈ జ్యూస్‌కు కొంచెం ఉప్పు కానీ పంచదార కానీ కలుపుకోవాలి. ఆ తర్వాత కొంత సేపు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అంతే ఎంతో సులువుగా ఆకుకూరల జ్యూస్ రెడీ. 


ఈ జ్యూస్‌ తాగడం వల్ల అలసట తొందరగా తగ్గుతుంది.  ఆకుకూరలు అంటే.. అబ్బా.. ఆకు కూరలా అని అనేస్తారు పిల్లలు, కొందరు పెద్దలు కూడా. ఆకుకూరలు చాలా రొటీన్‌గా ఉంటాయనేది వారి భావన. నిజమే మరి! వాటిని ఎక్కువగా పప్పోలోనో, పులుసు కూరో, వేపుడుకూరో చేసుకోవటం రివాజు. 


అయితే అలా ఇష్ట‌ప‌డ‌ని వారు ఇలా జ్యూస్ చేసుకొని తాగ‌డం చాలా ఆరోగ్య‌క‌రం. వాస్త‌వానికి మనకి ప్రకృతి ఇచ్చిన ఆరోగ్యవరాలలో ఆకు కూరలు చేసే అద్భుతాలెన్నో. శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తూ.. నిత్యం తమని ఏదో ఓరకంగా తీసుకునే వ్యక్తుల జీవనశైలినే మార్చేసే సత్తా ఆకుకూరలకు ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: