ఒకప్పుడు సెక్స్ అన్న మాట మాట్లాడేందుకు వెనకాముందు మనోళ్ళు ఆలోచించే వారు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమా సెక్స్ కి బానిసలుగా మారుతున్నారు. 18 ఏళ్లు నిండకుండానే వర్జినిటీ కోల్పోవడం.. సెక్స్‌లో పాల్గొనడం, అస్లీల వీడియోలు చూస్తూ.. వాటిలో చేసినట్లు అనుకరించడం.. లాంటివి చేస్తున్నట్లు ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో తేలింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన నిర్వాహకులు.. కొంతమందిని సర్వే చేయగా.. విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి.


సర్వేలో పాల్గొన్నవారిలో 33% మంది టీనేజ్‌లోనే సెక్స్ చేసినట్లు చెప్పాగా... ఇది 2003లో కేవలం 8 శాతం ఉంటె...  అది ఇప్పుడు 61 శాతానికి పెరిగింది. ఈ విషయంలో గౌహతి వాసులు తొలిస్థానంలో ఉన్నట్లు తేలింది. మొత్తంగా దాదాపు 79 శాతం మంది ఎక్కువ సేపు అస్లీల చిత్రాలు  చూస్తామని చెప్పారు. 85 శాతం మంది పురుషులు, 71 శాతం మంది స్త్రీలు తాము అస్లీల చిత్రాలు  చూస్తామని వెల్లడించారు. చివరికి పోర్న్‌కు బానిసలుగా మారి.. 48% మంది పురుషులు, 3% మంది మహిళలు డబ్బిచ్చి శృంగారంలో పాల్గొంటున్నారట.


ఇదిలా ఉండగా, పెళ్లికి వర్జినిటీ అనేది చాలా కీలకమని ఇప్పటికీ 53 శాతం మంది అభిప్రాయపడుతున్నారు.  అటు.. దేశంలో స్వలింగ సంపర్కులు కూడా ఎక్కువవుతున్నారట. భారతీయుల్లో ఇప్పటికీ 90% మంది స్వలింగ సంపర్కాన్ని వ్యతిరేకిస్తున్నా.. ఆర్టికల్ 377ను రద్దు చేయడంతో గేలు, లెస్బియన్లు పెళ్లి చేసుకునేందుకు ఎక్కువ ఉత్సుకత చూపిస్తున్నారట. ఆశ్చర్యకర విషయమేమిటంటే.. డేటింగ్‌ సైట్లలో ఎక్కువ మంది మహిళలు పేర్లు నమోదు చేసుకున్నారట.కాగా, సెక్స్ చేస్తున్న సమయంలో గిల్లడం, కొరకడం, కొట్టడం.. లాంటి అనుభవాలు తమకు ఎదురయ్యాయని 31 శాతం మంది వెల్లడించారు. 


27 శాతం మంది డిల్డోలు, వైబ్రేటర్లు వాడుతున్నామని వెల్లడించారు.  ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్ వాడకం ఎక్కువ కావడం కూడా సెక్స్ గురించి మాట్లాడుకునే సందర్భాలు పెరిగాయని, దానిపై అవగాహన పెరిగిందని సర్వేలో వెల్లడైంది. అంతేకాకుండా.. వీటివల్లే సైబర్ నేరాలు, బ్లాక్‌మెయిలింగ్, స్త్రీలు, పిల్లలపై లైంగిక దాడుల పెరిగాయని తేలింది. భార్యభర్తలు విడిపోవడానికి కూడా కారణాలు అవుతున్నాయని సర్వే తెలిపింది.  
సెక్స్ చేసే సమయంలో వీడియోలు, ఫోటోలు తీసుకోవడానికి మాత్రం భారతీయ జంటలు సమ్మతంగా లేరట.


మరింత సమాచారం తెలుసుకోండి: