కావాల్సిన ప‌దార్థాలు:
ఉసిరి కాయలు- అర కేజీ
మెంతులు- అర టీ స్పూను
సోంపు- ఒక టీ స్పూను


ఉప్పు- తగినంత
మిరప కారం- పావు కప్పు
ఆవాలు- ఒక టేబుల్‌ స్పూను


పోపు కోసం:
ఆవాలు- ఒక టీ స్పూను
ఇంగువ- కొద్దిగా
నూనె- 3 టేబుల్‌ స్పూన్లు


తయారీ విధానం: 
ముందుగా ఒక పాత్రలో నీళ్లు పోసి మరిగించాలి. ఆ పైన రంధ్రాలున్నప్లేట్‌ ఉంచి వాటి మీద ఉసిరికాయలను ఉంచి మూత పెట్టాలి. పది నిమిషాల పాటు స్టౌ మీదే ఉంచి దింపేయాలి. ఇప్పుడు ఉసిరికాయలలోని గింజలను వేరుచేయాలి. ఆ త‌ర్వాత ముక్కలను ఒక పాత్రలోకి తీసుకోవాలి. స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక ఆవాలు, మెంతులు, సోంపు వేసి దోరగా వేయించి దింపేయాలి. చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పక్కన ఉంచుకోవాలి.


స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, ఇంగువ వేసి వేయించాలి. ఉసిరి ముక్కలను జత చేసి వేయించాలి. మిరప కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలపి..పొడి చేసుకున్న ఆవాల పొడి మిశ్రమం కూడా జత చేసి దింపేయాలి. అంతే ఎంతో రుచిక‌ర‌మైన ఉసిరి ఊరగాయ రెడీ. అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. సో.. త‌ప్ప‌క ట్రై చేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి: