ఆరోగ్యకరమైన ఆహారం మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే ఏ టైమ్‌లో ఏది తినాలో, ఏ టైమ్‌లో ఏది తినకూడదో అనే నియమాలను ఖ‌చ్చితంగా పాటించాలి. అలాగే ఆహారాన్ని మితంగా తీసుకోవ‌డం కూడా చాలా ముఖ్యం. అతిగా తింటే విషంగా మారుతుందనే విషయం తెలిసిందే. అయితే కొన్ని ఆహార పదార్థాలు కొన్ని కొన్ని సమయాల్లో తీసుకుంటేనే మంచిది. పరగడుపునే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ప్రమాదమని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధార‌ణంగా టీ, కాఫీల‌తో రోజు ప్రారంభించేవారు కొంద‌రు.


అయితే పరగడుపున తాగే కాఫీ, టీల వల్ల హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడి తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు. అందుకనే ఒక గ్లాసు మంచినీళ్లు తాగిన తర్వాత కాఫీ, టీలు తీసుకోవడం మంచిది. ఖాళీ కడుపున అరటి పండ్లు తినడం వల్ల శరీరంలో ఉండే మెగ్నీషియం లెవల్స్ అమాం తం పెరుగుతాయి. ఇవి ఆరోగ్యరీత్యా ప్రమాదకరం. టమాటాలు ఎసిడిటీని పెంచుతాయి. ఖాళీ కడుపుతో వీటిని తింటే హృదయ సంబంధిత సమస్యలు ఎక్కువవుతాయి.


రోజు తీసుకునే అల్పాహారంలో ఎక్కువగా కారంగా ఉన్న పదార్థాలను తీసుకోకూడదు. కారంగా ఉండే ఆహారం, మసాలాలతో ఉండే పదార్థాలను తిన డం వల్ల ఎసిడిటీ, అల్సర్‌లు వచ్చే ప్రమాదం ఉంది. నారింజ, మొసంబి వంటి సిట్రస్ పండ్లను పరగడుపునే తినడం మంచిది కాదు. ఇవి పొత్తికడుపు పైభాగంలో మంటలు పుట్టేందుకు కారణమవుతాయి. అదే విధంగా చల్లని సోడా లాంటివి తాగడం మంచిది కాదు. ఇది ఉదరానికి జరిగే రక్త ప్రసరణపై ప్రభావం చూపుతుంది. ఇది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణం కావొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: