కావాల్సిన ప‌దార్థాలు:
ఇడ్లీలు- ఇరువై
ఇడ్లీ కారప్పొడి- కొద్దిగా
పసుప - అరచెంచా


కరివేపాకు కారప్పొడి- ఒక టేబుల్‌స్పూను
నిమ్మరసం- రెండు టేబుల్‌స్పూన్లు
నెయ్యి- మూడు టేబుల్‌ స్పూన్లు
ఉప్పు- కొద్దిగా


తయారీ విధానం: 
ముందుగా బాణలిని పొయ్యిమీద పెట్టి టేబుల్‌స్పూను నెయ్యి వేయాలి. అది కరిగాక ఇడ్లీకారప్పొడి వేయాలి. ఇప్పుడు రెండు నిమిషాలయ్యాక పది ఇడ్లీలను అందులో వేసి వేయించి, కొద్దిగా ఉప్పూ, సగం నిమ్మరసం, కొద్దిగా పసుపు వేసి ఓ పళ్లెంలోకి తీసుకోవాలి. 


అదే బాణలిలో మిగిలిన నెయ్యి కరిగించి కరివేపాకు కారప్పొడి వేయాలి. అందులో మరో పది ఇడ్లీలు వేసి వేయించి మిగిలిన ఉప్పూ, నిమ్మరసం, పసుపు వేయాలి. రెండునిమిషాలయ్యాక స్టౌ ఆఫ్ చేయాలి. అంతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మ‌సాలా మినీ ఇడ్లీలు రెడీ..! ఇడ్లీ దక్షిణ భారత దేశంలో విరివిగా వాడే అల్పాహార వంటకం. 


మినప్పప్పు లోని ప్రోటీన్లు, బియ్యంలోని పిండి పదార్థాలు కలిసి శరీరానికి కావలసిన శక్తిని ఇస్తాయి. ఇడ్లీలు ప్రపంచంలోని పది అత్యంత ఆరోగ్యవంతమైన వంటకాలలో ఒకటిగా చెప్పుకుంటారు. అయితే ఎప్పుడు రొటీన్‌గా చేసుకొనే ఇడ్లీలు చాలా మంది ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌చ్చు. ఇలా మ‌సాలా ఇడ్లీలు చేసుకుంటే త‌ప్ప‌కుండా ఇష్ట‌ప‌డ‌తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: