పొద్దుతిరుగుడు గింజలు.. వీటి గురించి చాలా తక్కువమందికి తెలుసు. కానీ, ఈ గింజలు తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. పొద్దుతిరుగుడు గింజలనుండి తీసిన నూనె ఆహారయోగ్యమైన వంటనూనె. అయితే మ‌న‌లో అధిక శాతం మంది పొద్దు తిరుగుడు విత్త‌నాల‌తో త‌యారు చేసిన నూనె (స‌న్ ఫ్ల‌వ‌ర్ ఆయిల్‌)ను వంటల్లో వాడుతుంటారు. సన్ ఫ్లవర్ ఆయిల్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.

అయితే కేవ‌లం ఆయిల్ మాత్ర‌మే కాదు.. పొద్దు తిరుగుడు విత్త‌నాలు, ఆకులు, వేర్లు కూడా మ‌న‌కు ఉప‌యోగ‌క‌ర‌మే.  పొద్దుతిరుగుడు గింజలను రెగ్యులర్‌గా తినవడం వల్ల.. ఇందులో ఉండే ఇన్సులిన్‌ నిరోధానికి సాయపడుతూ మధుమేహం రాకుండా అడ్డుకుంటాయి. పొద్దుతిరుగుడు గింజలు థైరాయిడ్‌ను దరిచేరనివ్వదు. అదే విధంగా.. క్యాన్సర్‌ని అడ్డుకునే గుణాలు పొద్దుతిరుగుడు గింజల్లో ఎక్కువగా ఉంటాయి.


పొద్దుతిరుగుడు విత్తనాలను రోజూ తింటే రక్తనాళాల్లో ఉండే కొవ్వు తగ్గుతుంది. దీంతో గుండెజబ్బులు రాకుండా ఉంటాయి.  ఈ విత్తనాల్లోని మెగ్నీషియం ఎముకలు గట్టిపడేందుకు ఉపయోగపడుతుంది. ఎముకల జాయింట్లు బాగా పనిచేసేలా ఈ గింజల్లోని కాపర్ సహకరిస్తుంది. అలాగే వీటిని తినడం వల్ల హైబీపీ కంట్రోల్‌లో ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: