కావాల్సిన పదార్థాలు
పచ్చిమిర్చి- 200 గ్రాములు
చింతపండు గుజ్జు- నాలుగు టేబుల్ స్పూన్స్‌
పోపు దినుసులు- కొద్దిగా
నూనె- స‌రిప‌డా


ఇంగువ- అర టీస్పూన్‌
నువ్వులు- రెండు స్పూన్ల 
పసుపు- అర టీస్పూన్‌
ఉప్పు- స‌రిప‌డా


తయారీ విధానం:
ముందుగా బజ్జీలు వేసే పచ్చిమిర్చిని తీసుకొని శుభ్రంగా కడిగి, తడి లేకుండా తుడుచుకుని వాటిని సగం ముక్కలుగా చేసుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేసి వాటిని మ‌గ్గించి ప‌క్క‌న‌ పెట్టుకోవాలి. ఆ తర్వాత వేరే గిన్నెలో పోపు దినుసులన్ని వేసి వేయించి, చల్లారిన తర్వాత రోట్లో వేసి పోపు దినుసుల్ని మెత్తగా దంచాలి. 


నువ్వుల్ని కూడా పోపు దినుసుల్లోన్నే వేసి వేయించాలి. తర్వాత ముందుగా మ‌గ్గించి పెట్టుకున్న పచ్చిమిర్చి, చింతపండు గుజ్జు, పసుపు, ఉప్పు, ఇంగువ వేసి బాగా మెత్తగా దంచాలి. అంతే స్పైసీ స్పైసీ రోటి ప‌చ్చిమిర్చి ప‌చ్చ‌డి రెడీ.. రైస్‌తో దీని కాంబినేష‌న్ చాలా బాగుంటుంది. 


భారతీయత, భారతీయ వంటకాలు వీటి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఎవరికైనా గుర్తుకు వచ్చేది మిరప, పచ్చిమిర్చి, పండు మిర్చి ఇవి రెండూ భారతీయ వంటకాల్లో కీలక స్థానం పోషిస్తాయి. అయితే ప‌చ్చిమిర్చి ఆరోగ్యానికి చాలా మంచిది. కూర‌ల్లో డైరెక్ట్‌గా తిన‌లేము కాబ‌ట్టి ఇలా ప‌చ్చ‌డి చేసుకొని తిన‌డం వ‌ల్ల రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.


మరింత సమాచారం తెలుసుకోండి: